CAA: నేటి నుంచి అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం.. నోటిఫై చేసిన కేంద్రం

Published : Mar 11, 2024, 05:08 PM ISTUpdated : Mar 11, 2024, 06:15 PM IST
CAA: నేటి నుంచి అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం.. నోటిఫై చేసిన కేంద్రం

సారాంశం

పౌరసత్వ సవరణ చట్టాన్ని ఈ రోజు కేంద్ర హోం శాఖ నోటిఫై చేసింది. దీంతో ఈ రోజు నుంచే ఈ సవరణ చట్టం అమల్లోకి వచ్చినట్టయింది.  

Citizenship Act: పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. దీంతో ఈ రోజు సాయంత్రం నుంచే ఈ సవరణ చట్టం అమల్లోకి వచ్చినట్టయింది. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందే పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అందరూ అనుకున్నట్టే ఎన్నికలకు ముందే ఈ చట్టాన్ని కేంద్ర హోం శాఖ నోటిఫై చేసి అమల్లోకి తెచ్చింది.

2019 డిసెంబర్‌లోనే పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించారు. 2020 జనవరి 10న ఇది అమలుకు సిద్ధమైంది. కానీ, ఇప్పటి వరకు ఈ చట్టాన్ని నోటిఫై చేయలేదు. అందుకే ఈ చట్టం అమల్లోకి రాలేదు. తాజాగా, ఈ రోజు సాయంత్రం సీఏఏను కేంద్ర హోం శాఖ నోటిఫై చేసింది.

Also Read: ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం.. బీఆర్ఎస్‌కు సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి

పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందిన హిందు, సిక్కు, జైన్, క్రైస్తవులు, బౌద్ధులు, పార్శీలు మత పీడనకు గురై భారత దేశానికి వస్తే.. వారి సీఏఏ కింద పౌరసత్వాన్ని ప్రసాదించడానికి ఈ చట్టం అనుమతి ఇస్తుంది. అయితే.. మతం ఆధారంగా పౌరసత్వాన్ని కల్పించాలనే ఆలోచన, చట్టం సమర్థనీయం కాదని, ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగానే ఈ చట్టాన్ని తెచ్చారనే చర్చ ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతున్న కాలంలో తీవ్రంగా జరిగింది.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !