Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • స్టార్ హీరోయిన్ తో ప్రేమలో సిద్ధు జొన్నలగడ్డ.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన టిల్లు హీరో బ్రదర్

స్టార్ హీరోయిన్ తో ప్రేమలో సిద్ధు జొన్నలగడ్డ.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన టిల్లు హీరో బ్రదర్

ప్రస్తుతం టాలీవుడ్ లో యుంగ్ హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ పేరు కూడా బాగా వినిపిస్తోంది. రొమాంటిక్ కామెడీ టచ్ ఉన్న చిత్రాలతో సిద్ధూ చెడుగుడు ఆడేసుకుంటున్నాడు.

tirumala AN | Published : Mar 11 2024, 05:33 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

ప్రస్తుతం టాలీవుడ్ లో యుంగ్ హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ పేరు కూడా బాగా వినిపిస్తోంది. రొమాంటిక్ కామెడీ టచ్ ఉన్న చిత్రాలతో సిద్ధూ చెడుగుడు ఆడేసుకుంటున్నాడు. అలాంటి చిత్రాల్లో అతడి పెర్ఫామెన్స్ కేక్ వాక్ లాగా అనిపిస్తోంది. డీజే టిల్లుతో అదరగొట్టిన సిద్ధూ జొన్నలగడ్డ త్వరలో టిల్లు స్క్వేర్ తో రాబోతున్నాడు. 

26
Asianet Image

సిద్దు జొన్నలగడ్డ గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీల, డీజే టిల్లు లాంటి చిత్రాలతో రొమాంటిక్ హీరోగా మారిపోయాడు. డీజే టిల్లు బ్లాక్ బస్టర్ కావడంతో ఆ చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టిల్లన్నా ఇలాగైతే ఎలాగన్నా అనే సాంగ్ కి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సారి కూడా ఎంటర్టైన్మెంట్ ఏమాత్రం తగ్గదు అని భరోసా చిత్ర యూనిట్ ఇస్తోంది.

36
Asianet Image

మార్చి 29న టిల్లు స్క్వేర్ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇదిలా ఉండగా సిద్ధూ జొన్నలగడ్డ పెళ్ళికి సంబంధించిన వార్తలు కూడా వస్తున్నాయి. సిద్దూ జొన్నలగడ్డ పెళ్లి, లవ్ అఫైర్ పై అతడి సోదరుడు చైతు జొన్నలగడ్డ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

46
Asianet Image

చైతు జొన్నలగడ్డ.. రోషన్ కనకాల బబుల్ గమ్ చిత్రంలో నటించారు. అంతకు ముందు కొన్ని చిత్రాల్లో నటించారు. తాజాగా ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

56
Asianet Image

సిద్ధూ జొన్నలగడ్డ ఒక స్టార్ హీరోయిన్ తో లవ్ ఎఫైర్ లో ఉన్నాడని రూమర్స్ వస్తున్నాయి.. నిజమెంత అని ప్రశ్నించగా.. స్టార్ హీరోతో లవ్ లో ఉంటే ప్రాబ్లమ్.. స్టార్ హీరోయిన్ తో లవ్ లో ఉంటే సమస్య ఏముంది అని నవ్వేశారు. 

 

66
Asianet Image

అయితే సిద్ధూ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడో లేదో తెలియదు.. కానీ అతడికి మ్యారేజ్ పై మాత్రం ఆసక్తి ఉంది. అయితే ఈ ఏడాది చేసుకుంటాడా లేక వచ్చే ఏడాది చేసుకుంటాడా అనేది క్లారిటీ లేదు అని చైతు జొన్నలగడ్డ అన్నారు. 

tirumala AN
About the Author
tirumala AN
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories