ఇవాళ్టి టాప్ టెన్ వార్తలు.
లోక్‌సభ 2024 ఎన్నికల్లో మోదీ ప్రభంజనం.. సర్వే వివరాలు
ఏషియా నెట్ న్యూస్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఈ లోక్ సభ ఎన్నికల్లో బిజెపి గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్లు తేల్చింది. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది తప్పదని ఈ సర్వే ఫలితాలు సూచించాయి. పూర్తి కథనం
తెలంగాణలో ప్రధాన పార్టీల బలాలు
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ ఉంటే అవకాశం ఉంది. అందులో ఒకటి అధికార కాంగ్రెస్ కాగా.. మరొకటి ప్రతిపక్ష బీఆర్ఎస్. ఇంకోటి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. అయితే ఈ మూడు పార్టీలకు తెలంగాణలో ఉన్న సానుకూల అంశాలు ఏంటి ? ప్రతికూల అంశాలు ఏంటి? పూర్తి కథనం
తెలంగాణలో జిల్లాల కుదింపు..?
తెలంగాణలో జిల్లాలను కుదించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం కొన్ని జిల్లాలో తక్కువ జనాభా ఉందని, అందుకే తగ్గించాలని యోచిస్తోందని తెలుస్తోంది. పూర్తి కథనం
మేమంతా సిద్ధం.. ప్రారంభం
వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ రోజు ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. పూర్తి కథనం
షర్మిల ఎందుకు మౌనందాల్చారు?
వైఎస్ షర్మిల ఉన్నట్టుండి మౌనముద్ర దాల్చారు. ఎన్నికలు సమీపిస్తున్నా ఆమె అస్త్రసన్యాసం ఎందుకు చేశారా? అనే ఆసక్తి నెలకొంది. పూర్తి కథనం
జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపబోం
జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపబోమని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అన్నారు. ఈ విషయంలో ఢిల్లీ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానని అన్నారు. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ నుంచి పాలన సాగిస్తున్న నేపథ్యంలో సక్సేనా ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి కథనం
గుజరాత్ ను చిత్తు చేసిన చెన్నై
CSK vs GT Highlights : ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్ 7వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి తమకు తిరుగులేదని చెన్నై నిరూపించింది. పూర్తి కథనం
కళ్లుచెదిరే క్యాచ్ పట్టిన ధోని
42 ఏళ్ల వయస్సులోనూ అద్భుతమైన ఆటతో.. సూపర్బ్ ఫీల్డింగ్ తో వికెట్ కీపింగ్ చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకుని గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ విజయ్ శంకర్ ను పెవిలియన్ కు పంపాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి కథనం
మేయర్ కూతురు మిస్సింగ్
గోవాలో ఓషో మెడిషన్ సెంటర్ కు వచ్చిన నేపాల్ మేయర్ కూతురు తప్పిపోయారు. గత సోమవారం రాత్రి నుంచి ఆమె కనిపించకుండా పోయారు. కూతురును వెతికిపెట్టాలని తండ్రి సోషల్ మీడియా ద్వారా గోవాలో ఉంటున్న వారిని అభ్యర్థించారు. పూర్తి కథనం
శాంసంగ్ నుండి లేటెస్ట్ టెక్నాలజీ ఫోన్
శాంసంగ్ లేటెస్ట్ టెక్నాలజీతో ఏ55, ఏ35 స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఈ ఫోన్ నీటిలో పడినా, నేలపై పడిన ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫోన్ యధావిధిగా పని చేస్తుంది. ఏఐ కెమెరా, కొత్త ఫీచర్లతో పాటు పలు ప్రత్యేక ఫీచర్లతో ఈ ఫోన్ విడుదలైంది. పూర్తి కథనం