April 5th - Top Ten News: టాప్ టెన్ తెలుగు వార్తలు.. నేటి బ్రేకింగ్ న్యూస్ 

By Rajesh Karampoori  |  First Published Apr 5, 2024, 7:25 PM IST

Top 10 News:  ఇవాళ్టి టాప్ టెన్ వార్తలు


Top 10 News: 

అచ్చెన్నాయుడుకి  ఈసీ నోటీసులు 

Latest Videos

AP Elections 2024: అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీ నేతలు అచ్చెన్నాయడు, అయ్యన్నపాత్రుడికి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్ పై ఇరువురు నేతలు ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా తప్పుడు ఆరోపణలు చేశారని  వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో కోడ్ ఉల్లంఘనపై వివరణ కోరుతూ అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడికి సీఈఓ ముఖేష్‌కుమార్‌ మీనా నోటీసులు ఇచ్చారు. పూర్తి కథనం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. 
 

ఏనుగు దాడి.. ఇద్దరి మృతి 

కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఒంటరి ఏనుగును బంధించేందుకు  అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.  ఏనుగు సంచారం నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే  ఇద్దరు రైతులు ఏనుగు దాడిలో మృతి చెందారు.పూర్తి కథనం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. 


కూన శ్రీశైలం గౌడ్ తో కాంగ్రెస్‌ నేతల భేటీ.. 

కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే  కూన శ్రీశైలం గౌడ్ కు కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు  కూన శ్రీశైలం గౌడ్ ను కలిసి  తమ పార్టీలో  చేరాలని కోరారు.  ఇవాళ  కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. గతంలో కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు.అయితే రాజకీయ పరిస్థితుల్లో మార్పుల కారణంగా ఆయన  బీజేపీలో చేరారు.  అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడ  కూన శ్రీశైలం గౌడ్ బీజేపీని వీడుతారనే ప్రచారం సాగింది. కానీ ,కూన శ్రీశైలం గౌడ్ మాత్రం బీజేపీలోనే కొనసాగారు.పూర్తి కథనం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.   


ఆ స్థానంలో అభ్యర్ధిని మార్చిన జనసేన 

సార్వత్రిక ఎన్నికల్లో రైల్వే కోడూరు శాసనసభ స్థానంలో అభ్యర్ధిని  జనసేన మార్చింది. తొలుత ఈ అసెంబ్లీ స్థానం నుండి యనమల భాస్కరరావు పేరును ప్రకటించారు.  క్షేత్రస్థాయి నుండి నివేదికల ఆధారంగా  అభ్యర్ధిని మార్చాలని  జనసేన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు  రైల్వే కోడూరు అసెంబ్లీ స్థానం నుండి అరవ శ్రీధర్ పేరును జనసేన ఖరారు చేసింది. పూర్తి కథనం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. 
 

ముంబై ఇండియ‌న్స్ కు రోహిత్ గుడ్ బై !

Rohit Sharma : హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించిన త‌ర్వాత ముంబై ఇండియ‌న్స్ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా తీసుకోవ‌డం, ఆ త‌ర్వాత ఛాంపియ‌న్ ప్లేయ‌ర్ రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌డం తీవ్ర వివాదం రేపింది. ఇక ఐపీఎల్ ప్రారంభ‌మైన త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు ముంబై ఆడిన మూడు మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలు కావ‌డం, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణ‌యాల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌స్తుతం డ్రెస్సింగ్ రూమ్ లోని ప‌రిస్థితులు అంత‌బాగా లేక‌పోవ‌డంతో ఈ ఎడిష‌న్ ముగిసిన త‌ర్వాత రోహిత్ శ‌ర్మ ముంబైని విడిచిపెట్టే అవ‌కాశ‌ముంద‌ని సంబంధిత నివేదిక‌లు (News 24 Sports -Vaibhav Bhola)పేర్కొంటున్నాయి. పూర్తి కథనం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.  

మయాంక్ యాదవ్ సక్సెస్ సీక్రెట్ ఇదే..  

మయాంక్ యాదవ్... ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అద్భుత ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన యంగ్ ప్లేయర్. బుల్లెట్ లాంటి బంతులతో ప్రత్యర్థి బ్యాట్ మెన్స్ ను బెంబేలెత్తిస్తున్న ఈ ఫాస్ట్ బౌలర్ ఇప్పుడు లక్నో సూపర్ జాయింట్స్ జట్టులో కీలక ఆటగాడు. ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక వేగంగా బంతులు వేసిన ఆటగాడిగా మయాంక్ రికార్డ్ సృష్టించాడు... ఇతడు ఐపిఎల్ లోని టాప్ 5 ఫాస్టెస్ట్ బౌలర్లలో ఒకరు.  అయితే ఈ బౌలింగ్ స్పీడ్ వెనకున్న రహస్యాన్ని మయాంక్ తల్లి బయటపెట్టారు. పూర్తి కథనం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.  


ఘనంగా అమలాపాల్ సీమంతం వేడుక..ఫోటోలు వైరల్

 డస్కీ బ్యూటీ అమలాపాల్ గురించి పరిచయం అవసరం లేదు. ఇద్దరమ్మాయిలతో, నాయక్ లాంటి చిత్రాలతో అమలాపాల్ టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది అమలాపాల్.. జగత్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. పెళ్ళైన రెండు నెలలకే అమలాపాల్ తన ప్రెగ్నన్సీ ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె బేబీ బంప్ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.  తాజాగా అమలాపాల్ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. సీమంతం ఫోటోలని అమలాపాల్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల్లో అమలాపాల్ ఎంతో అందంగా మెరిసిపోతోంది. దంపతులిద్దరూ చూడముచ్చటగా ఉన్నారు. పూర్తి కథనం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. 

 

రిలీజ్‌కి ముందే `కల్కి2898ఏడీ` అసలు కథ రివీల్..!

ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి2898ఏడీ`మూవీ పై వస్తున్న విషయంలో ప్రభాస్‌ అభిమానులను డిజప్పాయింట్‌ చేస్తున్నాయి. అయితే ఫ్యాన్స్ ని ఖుషి చేసే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలోవైరల్‌ అవుతుంది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సినిమా రిలీజ్‌కి ముందే అదిరిపోయే ప్లాన్‌ చేస్తున్నాడట. రిలీజ్‌కి ముందే అసలు కథ చెప్పబోతున్నారట. ఈ మేరకు ఒక యానిమేషన్‌ వీడియో రూపొందించే ప్లాన్‌లో ఉన్నారట.  పూర్తి కథనం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. 


చిరంజీవితో రొమాన్స్ ఎంజాయ్‌ చేయలేకపోయా.. భానుప్రియ షాకింగ్‌ కామెంట్స్

భానుప్రియ కు  సంబంధించిన ఓ ఇంటర్వ్యూ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఆమె అనేక ఇంట్రెస్టింగ్‌ విషయాలను పంచుకుంది. ఇప్పటి వరకు బయటకు రాని విషయాలను ఓపెన్‌ అయ్యింది. తాను నటించిన హీరోల గురించి, సినిమాల గురించి చెప్పుకొచ్చింది. ఈక్రమంలో ఆమె చేసే కామెంట్స్ మరింత ఆసక్తిని రేకెత్తించేలా ఉండటం విశేషం. పూర్తి కథనం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.  


ఏసీ ఎక్కువగా వాడితే ఏమౌతుందో తెలుసా?

ఏసీ కింద ఉన్నంతసేపు హాయిగానే ఉంటుంది. కానీ... ఎక్కువ సేపు ఏసీలో ఉంటే.. ఆరోగ్య సమస్యలు వస్తాయి అని మీకు తెలుసా? నమ్మకసక్యంగా లేకపోయినా ఇది నిజం. పూర్తి కథనం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. 
 

click me!