`కల్కి2898ఏడీ` నుంచి క్రేజీ ప్లాన్‌ చేసిన నాగ్‌ అశ్విన్‌.. రిలీజ్‌కి ముందే అసలు కథ..?

`కల్కి 2898ఏడీ` దర్శకుడు మామూలోడు కాదు, ఈ మూవీని నుంచి ఓ క్రేజీ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. దర్శకుడు మరింత క్రేజీగా ఓ పని చేయబోతున్నాడట. 
 

nag ashwin crazy plan about kalki 2898 ad arj

ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి2898ఏడీ` మూవీపై అనేక అనుమానాలున్నాయి. ముఖ్యంగా రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ లేదు. సినిమా ఎప్పుడు రిలీజ్‌ కాబోతుందనేది పెద్ద సస్పెన్స్. సీజీ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్‌ టైట్‌గా ఉండటం, ఎన్నికల నేపథ్యంలో సినిమాని వాయిదా వేయబోతున్నారట. ఈ మూవీని జూన్‌ ఎండింగ్‌లోగానీ, జులైలోగానీ రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారట. లేదంటే ఈ ఏడాది చివర్లో వచ్చే అవకాశం ఉంది. ఈ వార్తలు ప్రభాస్‌ అభిమానులను డిజప్పాయింట్‌ చేస్తున్నాయి. 

అయితే ఫ్యాన్స్ ని ఖుషి చేసే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలోవైరల్‌ అవుతుంది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సినిమా రిలీజ్‌కి ముందే అదిరిపోయే ప్లాన్‌ చేస్తున్నాడట. రిలీజ్‌కి ముందే అసలు కథ చెప్పబోతున్నారట. ఈ మేరకు ఒక యానిమేషన్‌ వీడియో రూపొందించే ప్లాన్‌లో ఉన్నారట. `కల్కి2898ఏడీ` కథ చాలా క్లిష్టంగా ఉన్న నేపథ్యంలో జనాలకు అర్థం కావడానికి చాలా కష్టంగా మారుతుంది. డైరెక్ట్‌ గా థియేటర్లో చూస్తే సినిమా అర్థం కాక అది మిస్‌ ఫైర్‌ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఆడియెన్స్ కి ముందే కథేంటో అర్థమయ్యేలా చేయబోతున్నారట నాగ్‌ అశ్విన్‌. 

ముందుగానే యానిమేషన్‌ వీడియో చేయాలనుకుంటున్నారట. ఇందులో సినిమా కథేంటో యానిమేషన్‌ ద్వారా చెప్పాలనుకుంటున్నారట. ఇందులోని పాత్రలు ఏంటి. వాటికి కల్కి ప్రపంచానికి సంబంధం ఏంటి? అనేది ఈ వీడియోలో చెబుతారట. ఇది చూసి సినిమా చూస్తే ఈజీగా అర్థమవుతుందని భావిస్తున్నారట. దీనికి సంబంధించిన ప్లానింగ్‌ జరుగుతున్నట్టు సమాచారం. 

అయితే ఈ వీడియోని ఓటీటీలో విడుదల చేయాలనుకుంటున్నారట. నెట్‌ ఫ్లిక్స్ లో ఈ యానిమేషన్‌ ప్రీలోడ్‌ని విడుదల చేయాలనుకుంటున్నారట. ఇలా దీని ద్వారా బిజినెస్‌ చేయబోతున్నారు, అలాగే జనాలకు అర్థమయ్యే పని చేయబోతున్నారు. ఇలా రెండు రకాలుగా తమకు లాభం జరుగుతుందని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. మరి ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి. మొత్తానికి నాగ్‌ అశ్విన్‌ ఓ క్రేజీ ప్లాన్ చేశారని చెప్పొచ్చు.  

ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న `కల్కి 2898ఏడీ`లో కమల్‌ హాసన్‌ గెస్ట్ గా కనిపిస్తారట. అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ, రానా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంకా చాలా మంది గెస్ట్ రోల్స్ లో మెరవబోతున్నారట. వైజయంతి మూవీస్‌ నిర్మిస్తున్న ఈ మూవీ ఇప్పటి వరకు అనుకున్న డేట్‌ మే 9, కానీ ఆ రోజున రిలీజ్‌ కాదని టాక్‌. మరి ఏ డేట్‌ని ఫిక్స్ చేస్తారో చూడాలి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios