march 7-Top Ten News: టాప్ టెన్ వార్తలు

By Mahesh KFirst Published Mar 7, 2024, 5:53 PM IST
Highlights

ఈ రోజు టాప్ టెన్ వార్తలు.
 

17న టీడీపీ-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో

ఈ నెల 17వ తేదీన టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా మరో సభను నిర్వహించనున్నాయి. ఈ సభలో ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను ముందుకు తీసుకెళ్లే విధానాలను వెల్లడిస్తామని నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడులు ఉమ్మడి ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. పూర్తి కథనం

బీజేపీ అంటే బాబు, జగన్, పవన్: షర్మిల

బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ కల్యాణ్ అని కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పిన బీజేపీ మాట మార్చిందని అన్నారు. కాంగ్రెస్ తోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ఆమె తెలిపారు. పూర్తి కథనం

చంద్రబాబునే రేవంత్ రెడ్డి తిట్టాలి: హరీశ్ రావు

పాలమూరు వెనుకబాటుతనానికి చంద్రబాబు కారణం అని, కాబట్టి రేవంత్ రెడ్డి ఆయన గురువు చంద్రబాబును తిట్టాలని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కరువుతోనూ రాజకీయాలు చేశాయని ఫైర్ అయ్యారు. పూర్తి కథనం

తెలంగాణలో 15 నుంచి ఒంటిపూట బడులు

ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు మధ్యాహ్నం వరకే పని చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే స్కూళ్లు నడవాలని విద్యా శాఖ అధికారులు ఆదేశించారు. పూర్తి కథనం

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడికి షాక్

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడికి చెందిన కాలేజీని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. చెరువుకు చెందిన స్థలాన్ని కబ్జా చేసి కాలేజీ కట్టారని పేర్కొంటూ అధికారులు బుల్డోజర్ సాయంతో కాలేజీని కూలగొట్టారు. పూర్తి కథనం

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం రద్దు

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా (Governor's Quota MLCs) ఎంపికైన ప్రొఫెసర్ కోదండరాం(Professor Kodandaram), అలీఖాన్ (Ali Khan)ల నియామకాన్ని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రద్దు చేసింది. పూర్తి కథనం

‘నో వర్క్, నో పే’ నిబంధన ప్రవేశపెట్టిన ప్రభుత్వం..

సరైన కారణం లేకుండా ఆఫీసుకు రాని ఉద్యోగులపై మణిపూర్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విధులకు రాకపోతే జీతం ఇవ్వబోమని తేల్చి చెప్పింది. పూర్తి కథనం

రాహుల్ గాంధీకి ఈసీ కీలక సూచన

కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ పలు సూచలను చేసింది. ప్రధాని నరేంద్ర మోడీపై వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. పూర్తి కథనం

అదుర్స్ లో ఎన్టీఆర్ కి డూపుగా నటించింది ఈయనే

ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో అదుర్స్ ఒకటి. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి డూపుగా నటించిన నటుడు గురించి ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది. పూర్తి కథనం

100 టెస్టు మ్యాచ్ లు ఆడిన భార‌త క్రికెట‌ర్లు వీరే

ధర్మశాలలో భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో ఐదో, చివరి మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ ఆడ‌టంతో భార‌త్ స్టార్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్వ‌న్ 100 టెస్టు మ్యాచ్ లు ఆడిన 14వ భార‌త క్రికెట‌ర్ ఘ‌న‌త సాధించాడు. పూర్తి కథనం

click me!