Today's Top Stories: బుర్జ్‌ ఖలీఫాపై మువ్వన్నెల జెండా.. దోచుకున్న సొమ్ము కక్కిస్తాం.. ఇషాన్‌ కిషన్ ను బీసీసీఐ

By Rajesh Karampoori  |  First Published Feb 14, 2024, 7:22 AM IST

Today's Top Stories: శుభోదయం.. ఈ రోజు టాప్ న్యూస్ లో బుర్జ్‌ ఖలీఫాపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.. దుబాయ్ స్టేడియంలో  ఒక్కేసారి వందేమాతరం' ఆలపించిన 35,000 మంది భారతీయులు, దోచుకున్న సొమ్ము కక్కిస్తాం.. కేసీఆర్ పై రేవంత్ ఫైర్.. , కేసీఆర్ సభలో తీవ్ర విషాదం.. ఎమ్మెల్యే కారు ఢీ .. హోంగార్డు మృతి.., నేనేం తక్కువ చేశా.. పాలిచ్చే గేదెను వద్దని దున్నపోతును తెచ్చుకున్నారు : కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు, ఉమ్మడి విజయనగరంలో నారా లోకేశ్ శంఖారావం, ఇకపై ప్రతి పోలీస్ స్టేషన్ లో ఓ సైబర్ వారియర్.. ఎందుకంటే..?   వంటి వార్తల సమాహారం. 


Today's Top Stories:

బుర్జ్‌ ఖలీఫాపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.. 

Latest Videos

Burj Khalifa: ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈలో పర్యటించిన విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ పర్యటన సందర్భంగా దుబాయ్‌లోని ప్రతిష్టాత్మకమైన బూర్జ్ ఖలీఫాపై భారత జాతీయ పతాకంతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ పేరు, ఫొటోలను గ్రాండ్‌గా ప్రదర్శించి.. గౌరవ అతిథి - రిపబ్లిక్ ఆఫ్ ఇండియా'అంటూ.. ఘనస్వాగతం పలికారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ahlan Modi: 'వందేమాతరం' ఆలపించిన 35,000 మంది భారతీయులు.. వీడియో చూస్తే గూస్‌బంప్సే!!

Ahlan Modi: ప్రధాని మోడీ  ప్రస్తుతం యూఏఈలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం అబుదాబీలోని జాయెద్ స్పోర్ట్స్ స్టేడియంలో భారతీయ కమ్యూనిటీ నిర్వహించిన ‘Ahlan Modi’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్విగ్నభరిత సంఘటన చోటుచేసుకుంది. ఒక్క సారిగా 35,000 మందికి పైగా భారతీయులు నిలబడి వందేమాతరం గేయాన్ని లయబద్ధంగా పాడారు.  . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను నెట్టింట్లొ తెగ వైరలవుతోంది.  


దోచుకున్న సొమ్ము కక్కిస్తాం.. కేసీఆర్ పై రేవంత్ ఫైర్.
 
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం ముసుగులో బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్ స్వాహా చేసిన సొమ్మును కక్కిస్తామనీ, ఆ డబ్బును రికవరీ చేసేందుకు ప్రభుత్వం రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిబాటును “చిన్న సమస్య” అని కొట్టిపారేస్తున్నారనీ,సానుభూతి పొందేందుకు, కాళేశ్వరం అవినీతి పై నుంచి దృష్టిని మళ్లించడానికే  కేసీఆర్ నల్గొండలో సమావేశాన్ని నిర్వహించారని అన్నారు. 


కేసీఆర్ సభలో తీవ్ర విషాదం.. ఎమ్మెల్యే కారు ఢీ .. హోంగార్డు మృతి..


నల్గొండ వేదికగా బీఆర్‌ఎస్‌ నిర్వహించిన ‘ఛలో నల్లగొండ’ సభ.. ఓ కుటుంబంలో విషాదం నింపింది. సభ నుంచి తిరిగి వస్తుండగా.. ఓ ఎమ్మెల్యే కారు అదుపుతప్పి అక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ హోంగార్డు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో హోంగార్డుకు గాయాలు కావడంలో తోటి సిబ్బంది సమీప ఆసుపత్రికి తరలించారు.   


నేనేం తక్కువ చేశా.. పాలిచ్చే గేదెను వద్దని దున్నపోతును తెచ్చుకున్నారు : కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

రైతుబంధు ఇవ్వడం కూడా చాతకావడం లేదా ఇంత దద్దమ్మలా అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. కేసీఆర్‌ను నల్గొండలో తిరగనివ్వరా.. కేసీఆర్ చంపి మీరు వుంటారా అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయ సభ కాదు.. పోరాట సభ అన్నారు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. మంగళవారం నల్గొండలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. కృష్ణాజలాలు మన జీవనర్మరణ సమస్య అన్నారు. బీఆర్ఎస్ వచ్చాక నల్గొండను ఫ్లోరైడ్ రహితంగా మార్చుకున్నామని.. భగీరథ నీళ్లతో ఫ్లోరైడ్ బాధలు పోయాయన్నారు. మా బతుకు ఇది అని చెప్పినా గతంలో ఏ పార్టీ పట్టించుకోలేదని కేసీఆర్ గుర్తుచేశారు.

ఇకపై ప్రతి పోలీస్ స్టేషన్ లో ఓ సైబర్ వారియర్.. ఎందుకంటే..?  

Cyber Warrior: పెరుగుతున్న సైబర్‌ నేరాల కట్టడిపై తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ) ప్రత్యేక దృష్టి సారించింది. నమోదయ్యే సైబర్‌ నేరాలను వేగవంతగా దర్యాప్తు చేయడానికి, బాధితులకు సత్వర న్యాయం చేకూర్చేందుకు ప్రతి పోలీసుస్టేషన్‌లో ఒక సైబర్‌ వారియర్‌ ఉండేలా సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చర్యలు చేపట్టారు.అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలోని 858 మంది కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లకు సైబర్‌ క్రైమ్‌ ఫిర్యాదులపై టీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ స్టేట్‌ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ) శిక్షణ ఇచ్చిందని బ్యూరో డైరెక్టర్‌ శిఖా గోయెల్‌ తెలిపారు. వారికి హైదరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో రెండు వారాల ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇందులో  1930 ఫోన్‌లో ఫిర్యాదులను స్వీకరించడం, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో నేరాన్ని నివేదించడం, అనుమానిత ఐడెంటిఫైయర్‌లను విశ్లేషించడం, అలాగే సోషల్ మీడియా,  ఆన్‌లైన్ ఆర్థిక మోసాలపై దర్యాప్తు చేయడం వంటి వాటిపై వారికి శిక్షణ ఇచ్చారు.  

ఉమ్మడి విజయనగరంలో నారా లోకేశ్ శంఖారావం 
 
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయం హీటెక్కుతోంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, గెలుపుపై ద్రుష్టి సారించాయి. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు రా.. కదలిరా పేరిట బహిరంగ సభలు నిర్వహించి.. విస్తృతంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నారా లోకేష్ కూడా ప్రచార రంగంలోకి దిగారు. ఇటీవలే యువగళం పాదయాత్ర పూర్తి చేసిన ఆయన యువగళం పాదయాత్రలో కవర్ చేయని ప్రాంతాల్లో శంఖారావం పేరుతో మరో యాత్ర చేపట్టారు.  

పవన్ హెలిప్యాడ్‌కు అనుమతి నిరాకరణ..భీమవరం పర్యటన వాయిదా..

రేపటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్  భీమవరం పర్యటన వాయిదా పడింది. పవన్ హెలిప్యాడ్‌కు ఏపీ రోడ్లు భవనాల శాఖ అనుమతి మంజూరు చేయకపోవడంపై ఆ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. పవన్ కల్యాణ్ హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం భీమవరం విష్ణు కాలేజీలో హెలిపాడ్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌కి దరఖాస్తు చేసింది జనసేన. దీనిపై కలెక్టర్, పోలీసు శాఖ అధికారులు సానుకూలంగా స్పందించారని జనసేన నేతలు అంటున్నారు. అయితే ఆర్ అండ్ బి శాఖ అధికారులు దూరంగా ఉన్న భవనాలను సాకుగా చూపించి హెలిప్యాడ్‌కు అనుమతి నిరాకరిస్తున్నరని జనసేన పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల వల్లనే అనుమతి ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

రామాయణ, మహాభారతాలు కల్పితం.. ప్రైమరీ స్కూల్ టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు 

మహాభారతం, రామాయణాలు.. ప్రధాని నరేంద్ర మోదీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిందో ప్రైమరీ స్కూల్‌ టీచర్. దీంతో రైట్‌వింగ్ గ్రూపు తీవ్ర ఆందోళనలు చేపట్టింది. అల్లర్లు చెలరేగాయి. ఈ క్రమంలో కర్ణాటకలోని మంగళూరు, పాఠశాలలో పనిచేస్తున్న ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. కోస్టల్ టౌన్‌లోని సెయింట్ గెరోసా ఇంగ్లీష్ హెచ్‌ఆర్ ప్రైమరీ స్కూల్‌కు చెందిన ఈ టీచర్ పిల్లలకు.. మహాభారతం, రామాయణాలు "కల్పితం" అని బోధించారని బిజెపి ఎమ్మెల్యే వేద్యస్ కామత్, అనుచరులు ఆరోపించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కూడా టీచర్ మాట్లాడారని వారు ఆరోపించారు.

INDIA Bloc: ఇండియా కూటమికి ఆప్ అల్టిమేటం 

Congress: ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రెండు సీట్లకు మించి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వమని ఇటీవలే పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూటమి నుంచి తప్పుకుని అన్ని సీట్లలో తామే పోటీ చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఇదే దారిలో ఢిల్లీ అధికార పార్టీ ఆప్ వెళ్లుతున్నది. ఢిల్లీలోని ఏడు లోక్ సభ సీట్లల్లో ఒక్క సీటు మాత్రమే కాంగ్రెస్‌కు ఇస్తామని పేర్కొంది.

ఇషాన్‌ కిషన్ ను బీసీసీఐ టార్గెట్ చేసిందా? 

BCCI warns Ishan Kishan: ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో జార్ఖండ్ తరఫున ఆడకుండా ఐపీఎల్ 2024కు సన్నద్ధమవుతున్న ఇషాన్ కిషన్ పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీసీఐకి స‌మాచారం ఇవ్వ‌కుండా ఇషాన్ వ్య‌వ‌హ‌రిస్తున్న‌తీరుపై ఇప్ప‌టికే టీమిండియా ప్ర‌ధాన కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ఘాటుగానే కామెంట్స్ చేశారు. దేశ‌వాళీ క్రికెట్ లో ఆడిన త‌ర్వాతే భార‌త జ‌ట్టులోకి వ‌స్తాడ‌ని సూచించిన‌ట్టు పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్ కు సిద్ధ‌మ‌వుతున్న ఇషాన్ కిష‌న్ తీరు క్రికెట్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

click me!