Top 10 Telugu News: శుభోదయం..ఇవాళ్టీ telugu.asianetnews టాప్ 10 తెలుగు వార్తలలో పవన్ కు రోజా స్ట్రాంగ్ కౌంటర్, మాజీ మంత్రి పుల్లారావుకు షాక్ ... తనయుడికి 14 రోజుల రిమాండ్ , ప్లీజ్ మోదీజీ ...: వైజాగ్ లో ఆసక్తికర ప్లెక్సీలు, "మగాడివైతే ఆ పని చేసి చూపించాలి.." : సీఎం రేవంత్ రెడ్డిపై కడియం ఘాటు వ్యాఖ్యలు, రాష్ట్రంలో ఎన్ని చిరుతపులులు ఉన్నాయో తెలుసా…? ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ఖరారు.., అన్ని రైళ్ల సర్వీసుల్ని నిలిపివేస్తాం.. :కేంద్రానికి రైల్వే సంఘాల హెచ్చరిక, రేవంత్ కుర్చీని లాక్కోవాలని కోమటిరెడ్డి, ఉత్తమ్ స్కెచ్ : ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు వంటి వార్తల సమాహారం.
Top 10 Telugu News: (పూర్తి కథనం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి)
పవన్ కు రోజా స్ట్రాంగ్ కౌంటర్
వైసీపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి ఆర్కే రోజా. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఏమీ ఆషామాషీగా సీఎం కాలేదన్నారు. ప్రజల ఆశీస్సులతో ఆయన తిరుగులేని ముఖ్యమంత్రిగా అయ్యారని.. మరి నువ్వు రెండు చోట్ల నిలబడితే రెండు చోట్లా గెలవలేకపోయావంటే అర్ధం చేసుకోవాలని రోజా చురకలంటించారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా వుండి 24 సీట్లకే పరిమితమైపోయి మళ్లీ క్యాడర్‌ను తిడుతున్నాడంటూ మంత్రి ఎద్దేవా చేశారు. బూత్ కమిటీలు, మండల కమిటీలను పార్టీ అధ్యక్షుడు ఏర్పాటు చేయాలని రోజా ధ్వజమెత్తారు.
మాజీ మంత్రి పుల్లారావుకు షాక్ ..
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ కు న్యాయస్థానం రిమాండ్ విధించింది. గురువారం సాయంత్రం శరత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అర్థరాత్రి విజయవాడ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. హైడ్రామా తర్వాత శరత్ ను న్యాయమూర్తి నివాసానికి తరలించారు పోలీసులు. అదే అర్ధరాత్రి రెండుగంటల వాదోపవాదం తర్వాత పోలీసులతో ఏకీభవించిన న్యాయమూర్తి శరత్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను విజయవాడ జైలుకు తరలించారు పోలీసులు.
ప్లీజ్ మోదీజీ ...: వైజాగ్ లో ఆసక్తికర ప్లెక్సీలు
విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోలతో ఆసక్తికర ప్లెక్సీలు వెలిసాయి. విశాఖకు వున్న చెడ్డపేరును తొలగించాాలని కోరుతూ జన జాగరణ సమితి ఈ ప్లెక్సీలు ఏర్పాటుచేసింది. ఇందులో ఏముందంటే... సముద్ర తీర అందాలు, ప్రకృతి సోయగాలకు నిలయం విశాఖపట్నం. అయితే ఈ అందాల వెనక ఓ చీకటి సామ్రాజ్యం నడుస్తోంది. దేశంలో అత్యధికంగా గంజాయి సాగు జరుగుతున్న ప్రాంతం విశాఖనే. ఇక్కడి గిరిజనప్రజల అమాయకత్వాన్ని, ఆర్థిక అవసరాలను అదునుగా చేసుకుని కొన్ని ముఠాలు అక్రమంగా గంజాయిని సాగుచేయిచేస్తున్నాయి. ఇక్కడి నుండి గంజాయిని దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నాయి. దీంతో విశాఖకు గంజాయి రాజధానిగా చెడ్డపేరు వుంది.ఈ చెడ్డపేరును తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీకి కోరుతూ విశాఖలో ప్లెక్సీలు వెలిసాయి.
రాష్ట్రంలో ఎన్ని చిరుతపులులు ఉన్నాయో తెలుసా…?
Leopard Population: దేశంలో చిరుత పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇదే విషయాన్ని నేషనల్ టైగర్ రిజర్వేషన్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నివేదిక తేటతెల్లం చేసింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ గురువారం వీటి నివేదికను విడుదల చేసింది. కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2018-2022 మధ్య కాలంలో దేశంలోని పెద్ద పులులు, చిరుత పులులు సంఖ్య పెరిగింది. ఈ కాలంలో 1.08 శాతం వృద్ధితో చిరుతల సంఖ్య 13,874కి చేరుకున్నట్టు అంచనా. .అయితే..ఆంధ్రప్రదేశ్‌లో పులుల సంఖ్యలో పెరుగుదల కనిపించగా.. తెలంగాణలో మాత్రం ఆ సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దేశ వ్యాప్తంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిపిన సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
"మగాడివైతే ఆ పని చేసి చూపించాలి.." : సీఎం రేవంత్ రెడ్డిపై కడియం ఘాటు వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)పై మాజీ ఉప ముఖ్యమంత్రి,ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 17కి 17 ఎంపీ స్థానాలను గెలిపించి సీఎం రేవంత్ రెడ్డి మగతనం చూపించుకోవాలని సవాల్ విసిరారు. గురువారం నాడు విలేకరుల సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ. కేటీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండించారు. హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ఖరారు..
PM Modi to visit Telangana: త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే వేళ.. ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. భారీ ఎత్తున ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో చేస్తు బిజీబిజీగా సాగుతున్నాడు. ఇటీవల తమిళనాడులో పర్యటించిన ప్రధాని మోడీ.. మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు.మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు.
రేవంత్ కుర్చీని లాక్కోవాలని కోమటిరెడ్డి, ఉత్తమ్ స్కెచ్
బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం కొమురం భీమ్ క్లస్టర్‌లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సీఎం కుర్చీని లాక్కోవడానికి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాచుకుని కూర్చొన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వుంటుందో, పోతుందో తెలియదని .. రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత ఒకటేనని అర్వింద్ ఆరోపించారు.
రేపోమాపో బీజేపీ అభ్యర్థులపై ప్రకటన
ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ జాతీయ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో ఎలాంటి విభేదాలు లేకుండా పనిచేయాలని పార్టీ నాయకత్వం ఇప్పటికే ఆదేశించింది. వచ్చే ఎన్నికల్లో 370 స్థానాల్లో గెలువాలనే టార్గెట్ తో కమలం పార్టీ సార్వత్రిక సమరానికి సమాయత్తమవుతోంది.ఈ తరుణంలో లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కోసం ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ కీలక సమావేశం జరిగింది. ఏప్రిల్-మేలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించకముందే బీజేపీ తొలి జాబితాను విడుదల చేయాలని యోచిస్తోంది.
"ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు"
Supreme Court: సుప్రీం కోర్టు కీలక తీర్పు నిచ్చింది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులని రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనను సుప్రీం కోర్టు సమర్థించింది. ఇది వివక్షత కాదని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ నిబంధన కారణంగా ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కోల్పోయాడు. దీంతో ఆ నిబంధనను సవాల్ చేస్తూ.. మొదట హైకోర్టును ఆశ్రయించగా..ఎదురుదెబ్బ తగిలింది. అయితే.. తగ్గేదేలే అన్నట్టు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా అదే రకమైన తీర్పును ఇవ్వడంతో మరో సారి షాక్ తిన్నాడు.
శరద్ పవార్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లను విందుకు ఆహ్వానించినట్టు శరద్ పవార్ తెలిపారు. ఎన్సీపీ (ఎస్‌సీపీ) అధినేత శరద్ పవార్ మహారాష్ట్ర రాజకీయాల్లో మరో గూగ్లీ వేశారు. శరద్ పవార్ నిర్ణయాలు చాలా సార్లు రాజకీయ విమర్శకలకు అందకుండా ఉంటాయి. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం కూడా ఇలాగే ఉన్నది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లను ఆయన విందుకు ఆహ్వానించారు.
అన్ని రైళ్ల సర్వీసుల్ని నిలిపివేస్తాం.. :కేంద్రానికి రైల్వే సంఘాల హెచ్చరిక
Railway unions: రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని షాక్ ఇచ్చారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ (OPS) అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒక వేళ తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే మే 1 నుండి భారతదేశం అంతటా అన్ని రైళ్ల సేవలను నిలిపివేస్తామని రైల్వే ఉద్యోగులు, కార్మికుల సంఘాలు బెదిరించాయి. ఇటీవల పలు రైల్వే సంఘాలు జాయింట్ ఫోరమ్ ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ పాత పెన్షన్ స్కీమ్ (JFROPS)అనే పేరిట ఒక్కటయ్యాయి. తాజా JFROPS కోర్ కమిటీ సమావేశమైంది.
WPL 2024: అదరగొట్టిన ఢిల్లీ.. భంగపడ్డ బెంగళూరు
RCB vs DC: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2024)లో ఏడవ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ తడబడింది. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 169 పరుగులు చేసింది. టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఇది రెండో విజయం కాగా, మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇది తొలి ఓటమి.