సత్ప్రవర్తన వల్లే బిల్కిస్ బానో రేపిస్టుల విడుదల.. సుప్రీంకోర్టులో తన నిర్ణయాన్ని సమర్థించిన గుజరాత్ ప్రభుత్వం

By team teluguFirst Published Oct 18, 2022, 10:12 AM IST
Highlights

బిల్కిస్ బానో కేసులో దోషులను వారి సత్ప్రవర్తన కారణంగా విడుదల చేయాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపిందని ఆ రాష్ట్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. 

బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషులకు మినహాయింపు ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని గుజరాత్ ప్రభుత్వం సమర్థించుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.14 ఏళ్ల జైలు శిక్ష పూర్తయిన తర్వాత ప్రభుత్వం దోషులను నిర్దోషులుగా విడుదల చేసిందని, వారి ప్రవర్తన బాగానే ఉందని ప్రభుత్వం పేర్కొందని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ నివేదించింది. ఈ కేసులో దోషులుగా ఉన్న వారిని విడుదల చేసేందుకు జూలై 11 నాటి లేఖ ద్వారా ముందస్తు విడుదలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని తన అఫిడివిట్ లో పేర్కొంది. 

పంజాబ్ లో పాకిస్తాన్ డ్రోన్ డ్రగ్స్ సరఫరా: సీజ్ చేసిన బీఎస్ఎఫ్

‘‘రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత ఆగస్టు 10న ఖైదీలను విడుదల చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. న్యాయస్థానం ఆదేశించిన 1992 విధానం కింద ప్రతిపాదనలను రాష్ట్రం పరిగణనలోకి తీసుకుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలో భాగంగా ఖైదీలకు ఉపశమనం మంజూరు చేసే సర్క్యులర్ కింద ఉపశమనం ఇవ్వలేదు ’’అని కోర్టుకు తెలిపింది.

పిల్ ముసుగులో మూడవ పక్షం క్రిమినల్ వ్యవహారంలో జోక్యం చేసుకోజాలదని ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొంది. ఉపశమనాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు పిల్ అధికార పరిధిని పూర్తిగా దుర్వినియోగం చేయడమేనని తెలిపింది. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం కూడా ఆమోదించిందని సుప్రీంకోర్టుకు తెలిపింది. 11 మంది రేపిస్టుల విడుదల చేయాలని తీసుకున్న నిర్ణయానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా జూలై 11న లేఖలో ఆమోదం చెప్పిందని పేర్కొంది. 

రైలులో సీటు కోసం జుట్టుపట్టుకొని కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్...!

అసలు ఏం జరిగిందంటే ? 
బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం ఆగస్టు 15న మినహాయింపు ఇచ్చింది. జీవిత ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న 1992 సడలింపు, ముందస్తు విడుదల విధానం ప్రకారం ఇది చోటు చేసుకుంది. అయితే వీరి విడుదల ఒక పెద్ద రాజకీయ వివాదానికి దారితీసింది. సామూహిక అత్యాచార దోషుల విడుదల చేయడం ప్రభుత్వ తప్పుడు నిర్ణయం అని విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారు. 

మా అమ్మ చాక్లెట్లు దొంగిలించింది.. అరెస్ట్ చేయండి.. పోలీస్ స్టేషన్ లో బుడ్డోడు.. వీడియో వైరల్...

దోషుల విడుదలకు సంబంధించిన సమాచారం బిల్కిస్ బానో ఘటన బాధితులకు సమాచారం అందలేదు. వారి విడుదలను సీపీఎం నేత సుభాషిణి అలీ, జర్నలిస్టు రేవతి లాల్, విద్యావేత్త రూప్ రేఖా వర్మ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీంతో పాటు టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా కూడా ఈ అంశంపై పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఏమిటీ బిల్కిస్ బానో కేసు.. ? 
2022 మార్చి 3వ తేదీన గుజరాత్ లో బిల్కిస్‌ బానో అనే ముస్లిం మహిళపై ఓ గ్యాంగ్ సామూహిక అత్యాచారానికి పాల్పడింది. గోద్రా ఘటన తర్వాత ఇది చోటు చేసుకుంది. బిల్కిస్ బానోపై అత్యాచారం జరిగినప్పుడు ఆమె గర్భవతిగా ఉన్నారు. బిల్కిస్‌ మూడేళ్ల బాలికతో పాటు మొత్తం 14 మందిని ఆ గ్యాంగ్ హత్య చేసింది. ఈ కేసులో కోర్టు వారిని దోషులుగా తేల్చింది. అయితే ఇటీవల ఆ దోషుల సత్ప్రవర్తన కారణంగా గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేయాలని నిర్ణయించింది. జైళ్ల సలహా కమిటీ సిఫార్సును గుజరాత్ ప్రభుత్వం ఉదహరించింది.
 

click me!