Thar desert expanding: అంత‌రిస్తోన్నఆరావ‌ళి శ్రేణులు.. విస్త‌రిస్తోన్న థార్ .. ఢిల్లీకి పొంచి ఉన్న ముప్పు..

By Rajesh KFirst Published Dec 20, 2021, 4:32 PM IST
Highlights

Thar Desert: ఆరావళి శ్రేణులను క్రమంగా తరిగి పోతుందని, దక్షిణ రాజస్థాన్‌లోని థార్ ఎడారి వేగంగా విస్తరిస్తోంది. ఈ కారణంగా థార్‌ ఎడారి, ఢిల్లీకి ముప్పు పెరగనుందని రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ వెల్లడించింది..
 

Thar desert expanding: ఆరావళి శ్రేణులను క్రమంగా తరిగి పోతుంది. పశ్చిమ రాజస్థాన్‌లోని  థార్ ఎడారి ప‌రిమాణం పెరుగుతోంది, త‌ద్వారా దేశ రాజ‌ధాని ఢిల్లీకి ముప్పు వాటిల్లే ప్ర‌మాదముంద‌ని రాజ‌స్థాన్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ అధ్య‌యనంలో సంచ‌ల‌న అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి. రాజ‌స్థాన్ సెంట్ర‌ల్ యూనివర్శిటీ లోని ఆఫ్ ఎర్త్ సైన్సెస్ స్కూల్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ చెందిన ప్రో. లక్ష్మీ కాంత్ శర్మ, మరో ఇద్దరు శాస్త్రవేత్తలతో కలిసి థార్ ప్రాంతం ఎడారీకరణపై  అధ్యయనాన్ని చేపట్టారు. 

ప్రజల వలసలు, వర్షపాతం నమూనాలో మార్పులు, ఇసుక దిబ్బల వ్యాప్తి, ప‌చ్చిక బ‌య‌ళ్ల క‌నుమ‌రుగు.  మైనింగ్, అశాస్త్రీయమైన ప్లాంటేషన్ డ్రైవ్‌ల కారణంగా  థార్ ఎడారి విస్తరిస్తోందని ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. ప్ర‌ధానంగా.. ఆరావళి కొండలు ఎడారి, మైదానాల మధ్య సహజమైన ఆకుపచ్చ గోడలాగా.. ప‌ని చేశాయ‌ని, కానీ, ఆరావళి ప‌ర్వత శ్రేణుల క్ర‌మ‌క్ష‌యంతో థార్ ఎడారి నుంచి ఇసుక తుఫానులు వాటిల్లే ప్ర‌మాదముంద‌ని, రాబోయే కొన్నియేండ్ల‌లో జాతీయ రాజధాని ఢిల్లీ వ‌ర‌కు థార్ ఎడారి విస్త‌రించే అవకాశ‌ముంద‌ని అంచ‌నా వేశారు.

Read Also: ఆరోగ్య సిబ్బంది సెలువుల‌ను రద్దు చేసే యోచ‌న‌లో తెలంగాణ‌ ప్ర‌భుత్వం

ప్ర‌ధాన కార‌ణాలుగా.. ఈ ప్రాంతంలో పశుగ‌ణం గ‌ణీయంగా పెరిగింది. వాటి మేత కోసం ఆరావ‌ళి పరిస‌ర ప్రాంతాల‌ను వాడ‌టం వ‌ల్ల  పచ్చిక బయళ్లు నాశనమ‌య్యాయి. అలాగే.. ఆరావ‌ళి ప‌రిస‌ర ప్రాంతాలైన‌  ఝున్ఝును, జలోర్, జోద్పూర్, బార్మర్ జిల్లాల్లో మైనింగ్ పెరిగింది. అలాగే.. ప్రజలు ఎడారి ప్రాంతాన్ని వదిలి వలసలు వెళ్ళటం. ఈ క్ర‌మంలో ఎడారి ప్రాంతంలో ఆవాసం ఏర్పాటు చేసుకుని అతిగా నేలని దున్ని పంటలు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. త‌ద్వారా వ‌ర్ష‌పాతంలో మార్పులు సంభ‌విస్తున్నాయి.  ఆరావళి శ్రేణుల ఉత్తర భాగాన్ని పర్యావరణ ప్రాంతంగా ప్రభావితమ‌వుతున్నాయని తెలిపారు. రాబోయే సంవ‌త్స‌రాల్లో ఎడారి విస్తరిస్తున్నందున ఇసుక తుఫానులు ఢిల్లీని తాకే ప్ర‌మాద‌ముందని డాక్టర్ శర్మ తెలిపారు.

Read Also: వరి ధాన్యం కొనుగోలు వివాదం: తెలంగాణపై కొడాలి నాని షాకింగ్ కామెంట్స్

అలాగే.. ఎక్కడబడితే అక్కడ ఆ ప్రాంతానికి చెందని చెట్లు పెంచటం వలన నీళ్లు అతిగా పీల్చేయటం అధికంగా జ‌రుగుతోంద‌ని నివేదిక‌లో వెల్ల‌డించారు. ఇసుక దిబ్బల వ్యాప్తిని నియంత్రణ‌కు ఇప్పటివరకు ఎటువంటి యంత్రాంగాన్ని ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌లేద‌ని అన్నారు. థార్ ఎడారి 4 జిల్లాల్లో 4.98 శాతం ఎడారిగా మారింది.  మొత్తం మీద 12 దక్షిణ రాజస్థాన్ జిల్లాల్లో 14.88 మిలియన్ హెక్టార్ల భూమి ఎడారిగా మారిందని నివేదిక‌లో వెల్ల‌డి అయ్యింది. కొన్ని ఇసుక తిన్నెలు సంవత్సరానికి 31.7 మీటర్ల వ్యాప్తి చెందాయి. ఎడారి గాలుల వలన 64.69 శాతం, నీటి ప్రభావంతో 10 శాతం భూమి ఎడారిగా మారుతోందని తెలిపారు. సహారా ఎడారి 10 శాతం వ్యాపించడం.  ఆసియాలోని 48 దేశాల్లో 38 దేశాల మీద ప్రభావం.

Read Also: Philippines: 208 మందిని బ‌లిగొన్న రాయ్ తుఫాను.. నిరాశ్ర‌యులైన ల‌క్ష‌ల మంది..

GLASOD (Gglobal Assessment of Human Induced Soil Degradation) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1990 నుండి సుమారు 2000 మిలియన్ హెక్టార్ల భూమి ఎడారిగా మారుతున్నట్లు తెలుస్తోంది. త‌ద్వారా 2015 లో 500 మిలియన్ ప్రజల మీద ప్రభావం చూపుతోంద‌ని, అలాగే..  పంటపొలాలు దెబ్బతినటం, ఇసుక తుఫానులు, వాయు కాలుష్యం జ‌రుగుతోంద‌ని తెలిపారు.   

click me!