తెలంగాణ బిల్లు: ఆ ఇద్దరు కీలక నేతల మృతి

By narsimha lodeFirst Published Aug 24, 2019, 3:02 PM IST
Highlights

తెలంగాణ బిల్లు(ఏపీ పునర్విభజన బిల్లు 2014)  గట్టెక్కడంలో కీలకంగా వ్యవహరించిన బీజేపీకి చెందిన ఇద్దరు నేతలు కన్నుమూశారు. మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీలు ఇద్దరూ కూడ తెలంగాణ బిల్లు పాస్ కావడంలో కీలకంగా వ్యవహించారు.

హైదరాబాద్:తెలంగాణ బిల్లు(ఏపీ పునర్విభజన బిల్లు 2014)  గట్టెక్కడంలో కీలకంగా వ్యవహరించిన బీజేపీకి చెందిన ఇద్దరు నేతలు కన్నుమూశారు. మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీలు ఇద్దరూ కూడ తెలంగాణ బిల్లు పాస్ కావడంలో కీలకంగా వ్యవహించారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 1998లో బీజేపీ కాకినాడ తీర్మానం చేసింది. ఒక్క ఓటు  రెండు రాష్ట్రాలు అనే ప్రచారం చేసింది బీజేపీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ అనుకూలంగా వ్యవహరించింది.

2009-14 వరకు రాజ్యసభలో అరుణ్ జైట్లీ ప్రధాన ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ-2 ప్రభుత్వం తెలంగాణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది.ఆ సమయంలో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షనేతగా సుష్మా స్వరాజ్ ఉన్నారు. రాజ్యసభలో అరుణ్ జైట్లీ విపక్షనేతగా ఉన్నారు.

పార్లమెంట్ సమావేశాల చివరి రోజున తెలంగాణ బిల్లు గట్టెక్కాలి. ఆ సమయంలో లోక్‌సభలో బీజేపీ నేత సుష్మాస్వరాజ్ ఈ బిల్లుకు అనుకూలంగా మాట్లాడారు.  ఈ బిల్లు  లోక్ సభలో పాస్ అయ్యేలా సుష్మా స్వరాజ్ సహకరించారు.

ఇక రాజ్యసభలో నాడు బీజేపీపక్ష నేతగా ఉన్న అరుణ్ జైట్లీ  ఏపీకి ప్రత్యేక హోదా విషయమై పట్టుబట్టాడు. ప్రధాని మన్మోహన్ సింగ్ హామీతో ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు చేశారు.

ఏపీ పునర్విభజన బిల్లు పార్లమెంట్ గట్టెక్కించడంలో ఆనాడు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ కీలకంగా వ్యవహరించారు. వీరిద్దరూ కూడ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నెల 6వ తేదీన సుష్మా స్వరాజ్ మృతి చెందారు. ఇవాళ అరుణ్ జైట్లీ మృతి చెందారు.

సంబంధిత వాార్తలు

తెలంగాణ బిల్లు: అరుణ్ జైట్లీ కీలక పాత్ర

అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి..

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత

అరుణ్ జైట్లీ కన్నుమూత... తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

అరుణ్ జైట్లీ: తెర వెనక వ్యూహకర్త, సుష్మా స్వరాజ్ లాగే...

అరుణ్‌జైట్లీ ప్రస్థానం: విద్యార్ధి నేత నుండి కేంద్ర మంత్రిగా....

డీ-4లో అరుణ్ జైట్లీ మృతితో మిగిలింది ఒక్కరే..

అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి...

అరుణ్ జైట్లీ మృతి.. ఢిల్లీకి అమిత్ షా పయనం

click me!