కోలుకుంటారని ఆశిస్తున్న స్థితిలో...: జైట్లీ మృతికి చంద్రబాబు సంతాపం

By telugu teamFirst Published Aug 24, 2019, 2:46 PM IST
Highlights

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జైట్లీ కోలుకుంటారని ఆశిస్తున్న తరుణంలో మనకు దూరం కావడం దురదృష్టకరమని చంద్రబాబు అన్నారు కేంద్ర మంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా, కేంద్ర మంత్రిగా జైట్లీ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన అన్నారు. 

అమరావతి: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైట్లీ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జైట్లీ కోలుకుంటారని ఆశిస్తున్న తరుణంలో మనకు దూరం కావడం దురదృష్టకరమని చంద్రబాబు అన్నారు కేంద్ర మంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా, కేంద్ర మంత్రిగా జైట్లీ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన అన్నారు. 

వాజ్ పేయి, నరేంద్ర మోడీ మంత్రివర్గాల్లో న్యాయ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణల కోసం జైట్లీ కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ప్రారంభమైన జైట్లీ తన రాజకీయ జీవితంలో ఎంపిగా, కేంద్ర మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగారని ఆయన అన్నారు 

ప్రముఖ న్యాయకోవిదుడిగానే కాకుండా గొప్ప పరిపాలనా దక్షుడిగా కూడా జైట్లీ పేరు పొందారని, జైట్లీ మృతి బిజెపికే కాకుండా యావత్తు భారతదేశానికే తీరని లోటు అని ఆయన అన్నారు భగవంతుడు జైట్లీ ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు  

సంబంధిత వార్తలు

తెలంగాణ బిల్లు: అరుణ్ జైట్లీ కీలక పాత్ర

అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి...

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత

అరుణ్ జైట్లీ కన్నుమూత... తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

అరుణ్ జైట్లీ: తెర వెనక వ్యూహకర్త, సుష్మా స్వరాజ్ లాగే...

అరుణ్‌జైట్లీ ప్రస్థానం: విద్యార్ధి నేత నుండి కేంద్ర మంత్రిగా....

డీ-4లో అరుణ్ జైట్లీ మృతితో మిగిలింది ఒక్కరే..

అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి...

అరుణ్ జైట్లీ మృతి.. ఢిల్లీకి అమిత్ షా పయనం

click me!