పోక్సో చట్టం: స్కిన్ టు స్కిన్ తాకాలన్న వివరణపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘దురుద్దేశాన్ని పరిగణించాలి’

By telugu teamFirst Published Nov 18, 2021, 3:00 PM IST
Highlights

పోక్సో చట్టంపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దుస్తుల మీద నుంచి తాకాడా? నేరుగా స్కిన్ టు స్కిన్ టచ్ అయిందా? అనే విషయం అనవసరమని పేర్కొంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడానికి నిందితుడి దురుద్దేశాన్నే దృష్టిలో పెట్టుకోవాలని వివరించింది. స్కిన్ టు స్కిన్ తాకకుండా ఓ మైనర్ బాలిక దుస్తుల మీద నుంచే వక్షస్థలాన్ని తాకాడని ఓ కేసులో నిందితుడిని నిర్దోషిగా బాంబే హైకోర్టు ప్రకటించింది.
 

న్యూఢిల్లీ: Bombay High Court చేసిన ఓ రూలింగ్‌పై అసంతృప్తి వ్యక్తమైన సంగతి తెలిసిందే. POCSO Act కింద దాఖలైన ఓ కేసులో నిందితుడిని నిర్దోషిగానూ ప్రకటించింది. Minor బాలిక వక్షస్థలాన్ని ఆ నిందితుడు దుస్తులపై నుంచే తాకాడని, నేరుగా Skin To Skin తాకలేదని పేర్కొంటూ ఈ కేసు పోక్సో చట్టం కింద పరిగణించలేమని పేర్కొంది. అనంతరం ఆ కేసు నుంచి వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ రూలింగ్ అప్పట్లో కొంత కలవరం కలిగించింది. ఈ తీర్పుపై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కూడా అభ్యంతరం తెలిపారు. ఇదే విషయాన్ని Supreme Court దృష్టికి తెచ్చారు. 

బాంబే హైకోర్టు తీర్పును ఏజీ కేకే వేణుగోపాల్ తప్పుపట్టారు. బాంబే హైకోర్టు తీర్పు ప్రమాదకర పరిస్థితులకు దారి తీయవచ్చని అన్నారు. ఒకవేళ సర్జికల్ గ్లవ్స్ పెట్టుకుని ఓ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడితే పోక్సో చట్టం కింద పరిగణనలోకి రాదనే సూచనలు ఈ తీర్పు ఇస్తున్నదని తెలిపారు. అందుకే ఈ తీర్పు ప్రమాదకరమైన పరిస్థితులకు బీజం వేయవచ్చునని ఆందోళన చెందారు.

Also Read: అలా తాకితే లైంగిక వేధింపులు కాదా..?

ఈ పిటిషన్ విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం టచ్ అనే పదంపై వివరణ కోరింది. దీని చుట్టూ వాదనలు విన్నది. టచ్ అంటే కేవలం తాకడం మాత్రమే అని అర్థమా? అంటూ ప్రశ్నించింది. ఒకవేళ దుస్తులు ధరించి ఉన్నంత మాత్రానా వారు టచ్ చేయాలనుకున్నది ఆ దుస్తులను కాదు కదా? అంటూ అడిగింది. కాబట్టి, పార్లమెంటు పోక్సో చట్టం చేసేటప్పుడు ఎలాంటి దృష్టిలో ‘టచ్’ అనే పదాన్ని పేర్కొందో అదే దృష్టితో ఆ పదాన్ని చూడాలని వివరించింది.

పోక్సో చట్టాన్ని మైనర్ బాలికలపై అఘాయిత్యాలను నియంత్రించే ఉద్దేశంతోనే పార్లమెంటు తెచ్చిందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గుర్తు చేసింది. కాబట్టి, ఇలాంటి అనవసర చర్చతో చట్టాన్ని నీరుగార్చకుండా చూసుకోవాల్సిన బాధ్యత కోర్టులపైనే ఉన్నదని వివరించింది. కాబట్టి, పోక్సో చట్టం కింద కేసును పరిగణించాలంటే స్కిన్ టు స్కిన్ టచ్ అయ్యారా? లేదా? అనేది చూడాల్సిన పని లేదని స్పష్టం చేసింది. కేవలం అఘాయిత్యానికి ఒడిగట్టిన వ్యక్తి దురుద్దేశాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. ఏ రకమైన విశ్లేషణ.. వాదనలైనా పోక్సో చట్టం అసలు లక్ష్యాన్ని తప్పుదారి పట్టకుండా చూడాలని వివరించింది. అవి చట్టాన్ని మరింత బలపర్చేలా ఉండాలని న్యాయమూర్తులు యూయూ లలిత్, ఎస్ఆర్ భట్, బేలా ఎం త్రివేదిల ధర్మాసనం పేర్కొంది.

Also Read: మైనర్‌పై రేప్ చేసిన వ్యక్తికి బెయిల్:ముంబై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

అటార్నీ జనరల్ క్రిమినల్ సైడ్ ఓ అప్పీల్ వేయడం ఇదే తొలిసారి అని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తెలిపింది. బాంబే హైకోర్టులో నిందితుడి వైపు సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూత్రా వాదించారు. పోక్సో చట్టంలో టచ్ అనే ప్రస్తావన ఉన్నదని, ఇక్కడ తమ క్లయింట్ మైనర్ బాలికను నేరుగా టచ్ చేయలేదని, దుస్తుల పై నుంచే తాకాడని ఈయన వాదనలు వినిపించారు. తాజాగా ఆయనే సుప్రీంకోర్టులో ఈ వాదనలపై అమికస్ క్యూరీగా వ్యవహరించారు. కాగా, ఆయన సోదరి కూడా బాంబే హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగానే తొలిసారి సోదరుడు, సోదరీ కూడా ఓ అంశంపై విభేదిస్తూ వాదిస్తున్నారని తెలిపింది. 

click me!