ముంబై: 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి ముంబై కోర్టు  బెయిల్ మంజూరు చేసింది. ఈ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.14 ఏళ్ల బాలిక గతంలో వ్యవహరించిన తీరు ఆమె మానసిక పరిపక్వత కలిగి ఉందన్న విషయాలను స్పష్టం చేస్తోందని ముంబై కోర్టు అభిప్రాయపడింది.

2019 జూన్ 14వ తేదీన తన కూతురు కన్పించడం లేదంటూ బాధితురాలి సవతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.సవతి తల్లి పెట్టే చిత్రహింసలు భరించలేక ఆమెతో గొడవ పెట్టుకొని బాధితురాలు ఇంటి నుండి పారిపోయింది.

 ఇంటి నుండి వచ్చిన  తర్వాత బాధితురాలు రోడ్ల వెంట దిక్కు తోచకుండా తిరిగింది. ముంబై సబర్బన్ రైలులో రైల్వేస్టేషన్ కు చేరుకొంది. అక్కడి నుండి చెన్నైకి చేరుకొంది.

ఆ తర్వాత ముంబైకి చేరుకొంది.  ఈ క్రమంలో తనపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని బాదితురాలు పోలీసులకు 2019 జూలై 10న ఫిర్యాదు చేసింది. ఈ కేసులో థ్యానేశ్వర్ నవ్‌ఘరే అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ కేసులో ధ్యానేశ్వర్ కు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

మైనరైన బాధితురాలికి స్వతంత్రంగా నిర్ణయం తీసుకొనే మానసిక పరిపక్వత ఉందని భావిస్తున్నట్టుగా కోర్టు అభిప్రాయపడింది. చెన్నై నుంచి ఇద్దరు అపరిచిత వ్యక్తులతో ముంబైకి తిరిగి వచ్చిందని కోర్టు గుర్తు చేసింది. 

ఇక్కడికి చేరుకున్న తర్వాత హుసేన్‌ అనే వ్యక్తిని కలిసింది. అతడితో ఆమెకు లైంగికపరమైన సంబంధం ఉంది. ఈ వ్యవహారాన్ని గమనించిన కొంతమంది బాటసారులు ఆమెను ములుంద్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. మరో అపరిచిత వ్యక్తిని తన కుటుంబ సభ్యునిగా పేర్కొంటూ అతడితో పాటు వెళ్లిపోయిందని కోర్టు ప్రస్తావించింది.

ఇవన్నీ గమనిస్తుంటే బాధితురాలి అంగీకారంతోనే లైంగిక చర్య జరిగి ఉందనే భావన స్ఫురిస్తోందని పేర్కొన్నారు.ఈ క్రమంలో రూ. 30 వేల వ్యక్తిగత పూచీకత్తు మీద ధ్యానేశ్వర్‌కు బాంబే హైకోర్టు బెయిలు మంజూరు చేసింది.