ఆ శృంగార వీడియో వ్యాప్తిని తక్షణమే అడ్డుకోండి.. ఆదేశించిన హైకోర్టు.. ఇంతకీ ఆ వీడియోలో ఉన్నది ఎవరంటే...

By SumaBala BukkaFirst Published Dec 2, 2022, 11:43 AM IST
Highlights

ఓ న్యాయవాదికి సంబంధించిన వీడియోను వ్యాపించకుండా అడ్డుకోవాలని ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వానికి, సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. 

ఢిల్లీ : గౌరవనీయమైన న్యాయవాద వృత్తిలో ఉన్న ఓ వ్యక్తికి సంబంధించిన శృంగార వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో నవంబర్ 29 నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది వ్యాప్తి చెందకుండా తక్షణమే అడ్డుకోవాలని ఢిల్లీ కోర్టు సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ వీడియోలో ఒక న్యాయాధికారి ఓ మహిళతో లైంగిక చర్యల్లో పాల్గొంటున్నటుగా ఉంది. ఆ వీడియో గనుక ఇలాగే షేరింగ్ లు అవుతూ వెడితే, మరింత వైరల్ అయి… ఫిర్యాదుదారు కాన్ఫిడెన్షియాలిటీ రైట్స్ కు భంగం కలుగుతుందని కోర్టు  చెప్పుకొచ్చింది.

జస్టిస్ యశ్వంత్ వర్మ బుధవారం రాత్రి ఈ కేసును విచారించారు.  బాధితురాలి గుర్తింపును దాచాలని, వెల్లడి చేయవద్దన్న అభ్యర్థనను ఆమోదించారు. ఈ మేరకు మధ్యంతర యునిలేటరల్ ఇంజెక్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన న్యాయ పరిపాలన విభాగంలో జరిగింది. దీనిని హైకోర్టు మొత్తం గుర్తించినట్లు తెలిపారు. ఈ వీడియో ఇకమీదట వ్యాప్తి చెందకుండా ఉండడానికి,  సోషల్ మీడియాలో,  ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు చర్యలు తీసుకోవాలని.. ఈ మేరకు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని  కోర్టు రిజిస్ట్రార్ జనరల్ ను ఆదేశించింది.

లూథియానా కోర్టు పేలుళ్ల కుట్రదారు హర్‌ప్రీత్ సింగ్‌ అరెస్ట్....

ఈ దిశగా అవసరమైన తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరింది. 2022 మార్చి 9న తీసిన ఆ వీడియోలో ఉన్న ఓ వ్యక్తి ఈ దావాను దాఖలు చేశారు. ఈ దావాను అత్యవసర పరిశీలనకు హైకోర్టు స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, సోషల్ మీడియాకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు మీద తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.

click me!