ప్రధాని అభిమానా మజాకా.. 200 కోట్ల సొంత ఖర్చుతో 190 అడుగుల మోడీ భారీ క్యాంస విగ్రహం..

By Sairam Indur  |  First Published Jan 31, 2024, 3:02 PM IST

ఆయన ప్రధాని మోడీకి వీరాభిమాని. తన అభిమానాన్ని చాటుచెప్పేందుకు ఏకంగా రూ.200 కోట్లతో భారీ క్యాంస విగ్రహాన్ని రూపొందించాలని సంకల్పించారు. అస్సాంలోని గౌహతికి చెందిన ఓ పారిశ్రామికవేత్త సొంత స్థలంలో 190 అడుగుల విగ్రహాన్ని నిర్మించనున్నారు (Assam-based industrialist Nabin Chandra Bora will build a massive 190-feet bronze statue of Prime Minister Narendra Modi at a cost of Rs 200 crore).


ప్రధాని నరేంద్ర మోడీకి దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. బీజేపీలోనే కాకుండా ఇతర పార్టీల్లోనూ ఆయనను ఆరాధించే వారు ఉంటారు. పలు సందర్భాల్లో తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. తాజాగా అస్సాంలోకి గౌహతి చెందిన ఓ వ్యాపారవేత్త కొత్త రీతిలో తన అభిమానాన్ని ప్రదర్శించాలని అనుకున్నారు. అందుకే రూ.200 కోట్ల సొంత ఖర్చుతో ప్రధాని నరేంద్ర మోడీ భారీ కాంస్య విగ్రహాన్ని తయారు చేయాలని సంకల్పించారు.

దేవాలయాలు పిక్నిక్, టూరిస్ట్ స్పాట్ కాదు - హిందూయేతరుల ప్రవేశంపై మద్రాస్ కోర్టు

Latest Videos

ప్రధాని మోడీ భారీ విగ్రహం తయారు చేయడం ఆయన ఆయన సంకల్పమే కాదు కల కూడా. అస్సాం కు చెందిన ఆ వ్యాపారవేత్త పేరు నబిన్ చంద్ర బోరా. 2016లో ప్రధాని నరేంద్ర మోడీ చేతులు మీదుగా ఆయనకు ప్రశంసా పత్రం అందింది.  అదే ఆయనకు ప్రేరణగా నిలిచింది. ఇక అప్పుడే ప్రధాని భారీ విగ్రహాన్ని రూపొందించాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఈ విగ్రహానికి సంబంధించిన పనులు ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతాయి.

మలేషియా కొత్త రాజుగా సుల్తాన్ ఇబ్రహీం..

నవిన్ చంద్ర బోరా గౌహతిలోని జలుక్బరి ప్రధాన బస్టాండ్ సమీపంలో ఉన్న సొంత స్థలంలో ఈ విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి సోమవారం నుంచి మూడు రోజుల పాటు భూమి పూజ ప్రారంభమైంది. తన సొంత సంపాదనతో సుమారు రూ.200 కోట్ల బడ్జెట్ తో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని బోరా ‘ఈటీవీ భారత్’ తో చెప్పారు. 60 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ 60 అడుగులతో కలిపి మొత్తం ఎత్తు 250 అడుగులు ఉంటుంది.

వాహనదారులకు బిగ్ అలెర్ట్.. నేడే చివరి తేదీ..

కాగా.. ఈ కాంస్య విగ్రహం డిజైన్ కూడా ఖరారైంది. 190 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహం మెడలో అస్సామీ సంస్కృతికి చిహ్నమైన గమోసా ఉంటుంది. ఈ విగ్రహానికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను ప్రధాని కార్యాలయానికి పంపినట్లు బోరా తెలిపారు. ఇందులో తనకు వస్తున్న ఆదాయ మార్గాలను కూడా వెల్లడించారు.

ఇమ్రాన్ ఖాన్ కు దెబ్బ మీద దెబ్బ.. మరో కేసులో భార్యతో పాటు 14 ఏళ్ల జైలు.. ఈ కొత్త కేసు ఏంటంటే ?

‘‘ఈ ప్రాజెక్టు ప్రధానికి అంకితం.  ప్రపంచంలోని అత్యుత్తమ ప్రధానమంత్రుల్లో ఆయన ఒకరు. అంతటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని నిర్మించే అవకాశం రావడం నా అదృష్టం. నా ప్రయత్నం వెనుక ఎలాంటి రాజకీయం లేదు. ప్రధాని మోడీ స్వయంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.’’ అని బోరా వెల్లడించారు.

click me!