ఇమ్రాన్ ఖాన్ కు దెబ్బ మీద దెబ్బ.. మరో కేసులో భార్యతో పాటు 14 ఏళ్ల జైలు.. ఈ కొత్త కేసు ఏంటంటే ?
పాకిస్తాన్ మాజీ ప్రధానికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఆయనపై నమోదైన కేసుల్లో వరుసగా దోషిగా తేలుతున్నారు. సైఫర్ కేసు లో మంగళవారం ఇమ్రాన్ ఖాన్ తో పాటు పాక్ మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ లకు మంగళవారం పదేళ్ల జైలు శిక్ష పడింది. అయితే మరో కేసులో బుధవారం కూడా ఆయన దోషిగా తేలారు. (Former Pakistan PM Imran Khan and his wife Bushra sentenced to 14 years in jail in Toshakhana case) అందులో ఇమ్రాన్ ఖాన్ తో పాటు భార్యకు కూడా 14 ఏళ్ల జైలు శిక్ష పడింది.
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రభుత్వ రహస్యాలను ఉల్లంఘించినందుకు ఇమ్రాన్ ఖాన్, పాక్ మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ లకు సైఫర్ కేసు లో పాక్ ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు వెలువడిన 24 గంటల తరువాత ఆయన మరో కేసులో దోషిగా తేలారు. ఇందులో ఆయన భార్యను కూడా కోర్టు దోషిగా నిర్ధారించింది.
దేవాలయాలు పిక్నిక్, టూరిస్ట్ స్పాట్ కాదు - హిందూయేతరుల ప్రవేశంపై మద్రాస్ కోర్టు
తోషాఖానా కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయన భార్య బుష్రా బీబీలకు కూడా పాకిస్తాన్ కోర్టు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా ఈ జంటను 10 సంవత్సరాల పాటు ప్రభుత్వ పదవిలో కొనసాగకుండా నిషేధించింది. వారికి రూ .787 మిలియన్ల పాకిస్తాన్ రూపాయి జరిమానా విధించింది.
Andhra Pradesh Election 2024 : తెలంగాణ వ్యూహమే ఏపీలోనూ... షర్మిల ప్లాన్ మామూలుగా లేదుగా..!
ఏమిటీ తోషాఖానా కేసు..
ప్రభుత్వ బహుమతుల అమ్మకానికి సంబంధించిన కల్పిత వివరాలను ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల సంఘానికి సమర్పించారని ఆరోపిస్తూ అధికార పార్టీ శాసనసభ్యులు 2022 లో పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ (ఇసిపి) కు తోషాఖానా కేసు దాఖలు చేశారు. అయితే ఈసీపీ తొలుత ఆయనపై అనర్హత వేటు వేసి, ఆ తర్వాత సెషన్స్ కోర్టులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ కేసు నమోదు చేసి, ఆ తర్వాత ఖాన్ ను జైలుకు పంపారు.
మలేషియా కొత్త రాజుగా సుల్తాన్ ఇబ్రహీం..
విదేశీ నేతల నుంచి వచ్చిన కానుకలను తోషాఖానా (స్టేట్ స్టోర్)లో ఉంచుతారు. 2018 నుంచి 2022 వరకు ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు విదేశీ అధికారుల నుంచి వచ్చిన బహుమతులు, ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన బహుమతుల వివరాలను ఖాన్ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని ఆరోపణలు ఉన్నాయి. వాటి అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని దాచిపెట్టారని ఈ కేసు ఆరోపించింది.
వాహనదారులకు బిగ్ అలెర్ట్.. నేడే చివరి తేదీ..
తోషాఖానా నియమ, నిబంధనల ప్రకారం.. అందుకున్న బహుమతులు, ఇతర సామగ్రిని క్యాబినెట్ విభాగానికి నివేదించాలి. తన మూడున్నరేళ్ల పాలనలో ప్రపంచ నాయకుల నుంచి రూ.140 మిలియన్లకు పైగా విలువైన 58 బహుమతులను అందుకున్న ఇమ్రాన్ ఖాన్, వాటన్నింటినీ అతి తక్కువ మొత్తాన్ని చెల్లించి లేదా ఎలాంటి చెల్లింపులు లేకుండా తన వద్దే ఉంచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. కాగా.. ఈ తోషాఖానా కేసులో 2023 ఆగస్టు 5 న లాహోర్ లో ఇమ్రాన్ ఖాన్ ను పోలీసులు అరెస్టు అయ్యారు.