రామ మందిర నిర్మాణంతో భారతీయుల కల సాకారం: పార్లమెంట్ సమావేశాలను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము

By narsimha lode  |  First Published Jan 31, 2024, 11:18 AM IST

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను  రాష్ట్రపతి ద్రౌపదిముర్ము  ఇవాళ ప్రారంభించారు.  పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ముర్ము ప్రసంగించారు.



న్యూఢిల్లీ:ఎన్నో ఏళ్ల భారతీయుల కల రామమందిర నిర్మాణంతో సాకారమైందని రాష్ట్రపతి   ద్రౌపది ముర్ము చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను  బుధవారం నాడు ఆమె ప్రారంభించారు. పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు.అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అన్ని ఆటంకాలను అధిగమించిన విషయాన్ని రాష్ట్రపతి ముర్ము ప్రస్తావించారు.

కొత్త పార్లమెంట్ భవనంలో ఇది తన తొలి ప్రసంగంగా  రాష్ట్రపతి  చెప్పారు.శాంతినికేతన్ ప్రపంచ వారసత్వ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిందన్నారు.చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన  తొలి దేశం భారత్ అని ఆమె గుర్తు చేశారు. భగవాన్ బిర్సాముండా జన్మదినాన్ని జగన్ జాతీయ దివస్ గా జరుపుకుంటున్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు.ఆదీవాసీ యోధులను స్మరించుకోవడం గర్వకారణంగా ఉందన్నారు.ఆదిత్య ఎల్-1 మిషన్ ను భారత్ దిగ్విజయంగా ప్రయోగించిన విషయాన్ని రాష్ట్రపతి ప్రస్తావించారు.భూమి నుండి  15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి ఆదిత్య ఎల్-1 ప్రవేశించిందన్నారు.జీ-20 సమావేశాలను భారత్ విజయవంతంగా నిర్వహించిందన్నారు.

Latest Videos

ఆసియా క్రీడల్లో భారత్ తొలిసారిగా  107 పతకాలు సాధించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.ఆసియా పారా క్రీడల్లో భారత్  111 పతకాలు సాధించిందన్నారు.భారత్ లో తొలిసారిగా  నమో భారత్ రైలును ప్రారంభించినట్టుగా రాష్ట్రపతి తెలిపారు.నారీశక్తి వందన్ అధినీయం బిల్లు (మహిళా రిజర్వేషన్ బిల్లు)ను ఆమోదించుకున్నామన్నారు.

రీఫార్మ్, ఫర్‌పార్మ్, ట్రాన్స్ ఫార్మ్ కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్రపతి చెప్పారు.ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ముర్ము ప్రస్తావించారు.ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్ మన లక్ష్యంగా రాష్ట్రపతి  చెప్పారు.పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్ ముందుకెళ్తుందని రాష్ట్రపతి తెలిపారు. తెలంగాణలో  సమ్మక్క, సారక్క గిరిజన వర్శిటీ ఏర్పాటుకానుందన్నారు.

దేశంలో 5 జీ నెట్ వర్క్ వేగంగా విస్తరిస్తుందని రాష్ట్రపతి చెప్పారు. కొత్త క్రిమినల్ చట్టాన్ని తీసుకు వచ్చిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. రక్షణ రంగం, అంతరిక్ష రంగాల్లో కొత్త ఆవిష్కరణలు జరిగిన విషయాన్ని రాష్ట్రపతి గుర్తు చేశారు.
తన చిన్నప్పటి నుండి గరీబీ హాఠావో నినాదాలు వింటున్నట్టుగా ఆమె చెప్పారు. కానీ, ప్రస్తుతం దేశంలో పేదరికాన్ని పారద్రోలే కార్యక్రమం సాగుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్ వ్యవస్థల్లో భారత్ ఒక్కటని చెప్పారు.

ఆత్మనిర్భర భారత్,మేకిన్ ఇండియా మన బలాలని రాష్ట్రపతి తెలిపారు.లక్షల కోట్లు వెచ్చింది దేశమంతా తాగునీటి వసతి కల్పిస్తున్నామన్నారు.ఉజ్వల కనెక్షన్లు పది కోట్లు దాటాయన్నారు.కరోనా సమయంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందించిన విషయాన్ని రాష్ట్రపతి  గుర్తు చేశారు. రూ.7 లక్షల ఆదాయం వరకు  పన్ను లేకుండా చేసినట్టుగా వివరించారు.సామాన్యులకు భారం పడకుండా పన్ను సంస్కరణలను కేంద్రం అమలు చేస్తుందన్నారు.

2 కోట్ల మంది మహిళలు స్వయం సమృద్ది సాధించారన్నారు. 4.10 కోట్ల మందికి పక్కా ఇళ్లు నిర్మించిన విషయాన్ని రాష్ట్రపతి వివరించారు.కిసాన్ సమ్మాన్ ద్వారా 10 కోట్ల మంది రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్నట్టుగా  ముర్ము తెలిపారు.లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని రాష్ట్రపతి గుర్తు చేశారు.
కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేయడం చారిత్రక నిర్ణయంగా ముర్ము పేర్కొన్నారు.

పదేళ్లలో  వేల ఆదీవాసీ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు.ఆదీవాసీ గ్రామాలకు పరిశుభ్రమైన జలాలను అందిస్తున్నట్టు రాష్ట్రపతి చెప్పారు.  ట్రాన్స్ జెండర్లకు  సమాజంలో గౌరవస్థానం కల్పించినట్టుగా ఆమె తెలిపారు.దేశాభివృద్ధి నాలుగు స్థంభాలపై ఆధారపడి ఉందన్నారు.యువశక్తి, నారీశక్తి, రైతులు,పేదలు అనే స్థంభాలపై యువశక్తి ఆధారపడి ఉందని  రాష్ట్రపతి వివరించారు.

కరోనా , యుద్ధాల ప్రభఆవం దేశంలో ధరల పెరుగుదలపై పడకుండా జాగ్రత్తపడినట్టుగా రాష్ట్రపతి  తెలిపారు.యూపీ, తమిళనాడులో రక్షణ కారిడార్లు ఏర్పాటు చేసిన విషయాన్ని రాష్ట్రపతి గుర్తు చేశారు.


 

 

 

click me!