Indians: లడాఖ్‌లో గొర్రెల కాపర్ల దెబ్బకు తోకముడిచిన డ్రాగన్ ఆర్మీ

By Mahesh K  |  First Published Jan 31, 2024, 2:00 PM IST

లడాఖ్‌లో స్థానిక గొర్రెల కాపర్లకు డ్రాగన్ ఆర్మీ అడ్డుతగిలింది. గొర్రెలను మేతకు అక్కడికి తీసుకురావద్దని అభ్యంతరం చెప్పగా.. గొర్రెల కాపర్లు లక్ష్య పెట్టలేదు. తమ హక్కులను కాపాడుకోవడానికి పీఎల్ఏ ముందు ధైర్యంగా నిలబడి మాటలతో కొట్లాడారు.
 


India China Border: 2020 గాల్వన్ లోయలో హింసాత్మక ఘర్షణల తర్వాత సరిహద్దులో సాధారణ పరిస్థితులు నెలకొనలేవు. ఆ ఘర్షణల తర్వాత అక్కడంతా ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. అయితే లడాఖ్‌లోని గొర్రెల కాపర్లు ఆ టెన్షన్ అట్మాస్పియర్‌కు ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఘర్షణల తర్వాత అప్పటి వరకు వారంతా గొర్రెలను కాచుకోవడానికి అటువైపు వెళ్లలేదు. కానీ, ఇప్పుడు మళ్లీ మొదలు పెట్టారు. గొర్రెల మందను మేత కోసం తీసుకెళ్లగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అడ్డుతగిలింది. ఇక్కడికి ఎందుకు వచ్చారని? గొర్రెల మేతకు ఇటు రావొద్దని, ఇది చైనా భూభాగం అని రకరకాలుగా పేలారు. కానీ, ఆ లడాఖ్ గొర్రెల కాపర్లు వెనుదిరగలేదు. నిలబడి వారితో వాగ్వాదానికి దిగారు. చివరకు అనుకున్నది సాధించారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

It is heartening to see the positive impact made by @firefurycorps_IA
in Border areas of Eastern Ladakh in facilitating the graziers & nomads to assert their rights in traditional grazing grounds along the north bank of Pangong.
I would like to thank for such strong… pic.twitter.com/yNIBatPRKE

— Konchok Stanzin (@kstanzinladakh)

ఆ వీడియోను చుషుల్ కౌన్సిలర్ కొంచాక్ స్టాంజిన్ షేర్ చేశారు. భారత ఆర్మీ తర్వాత రెండో సంరక్షకులుగా ఈ తెగ ప్రజలే నిలబడుతున్నారని కొనియాడారు. మన దేశ రక్షణకు ధైర్యంగా నిలబడిన ఆ నొమాడ్స్‌కు సెల్యూట్ అంటూ గర్వాన్ని వ్యక్తపరిచారు.

Latest Videos

undefined

Also Read :Jharkhand: జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ భార్యకు బాధ్యతలు?

మనవారు గొర్రెలను మేత కోసం ఆ ఏరియాకు తీసుకెళ్లడంపై చైనా ఆర్మీ అభ్యంతరం చెప్పింది. మేత మేస్తున్న ప్రాంతం చైనా దేశానిదని వితండవాదం చేశారు. కానీ, మన స్థానిక ప్రజలు పీఎల్ఏ ముందు ధైర్య సాహసాలు ప్రదర్శించారు. వెనక్కి తగ్గలేదు. దేశ సరిహద్దులపై ఉభయ దేశాలకు ఉన్న భిన్నమైన అభిప్రాయాలతో ఈ గొడవకు ఎండ్ కార్డ్ పడేలా లేదు. అని స్టాంజిన్ పేర్కొన్నారు.

చైనా ఆర్మీ ముందు రొమ్ము విరుచుకుని వారంతా నిలబడటాన్ని చూస్తే ముచ్చటేస్తున్నది. ప్యాంగాంగ్ సరస్సు తీరంలో గొర్రెలను మేతకు తీసుకెళ్లే తమ హక్కుల కోసం వారు మాట్లాడటం బాగుంది. భారత ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నాను. అక్కడ సాధారణ పౌర సమాజంతో ఎంత కలివిడిగా ఉండి జాగృతం చేశారో కదా.. అని వివరించారు.

click me!