మలేషియా కొత్త రాజుగా సుల్తాన్ ఇబ్రహీం..
మలేషియా రాజుగా జోహోర్ రాష్ట్రానికి చెందిన సుల్తాన్ ఇబ్రహీం నియామకం (Sultan Ibrahim of Johor state was appointed as the king of Malaysia) అయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారం కౌలాలంపూర్ లోని జాతీయ ప్యాలెస్ లో బుధవారం జరిగింది. ఇక్కడ కేవలం విచక్షణ అధికారాలు ఉన్న రాచరిక వ్యవస్థ అమల్లో ఉంది.
మలేషియాకు కొత్త రాజు వచ్చారు. కౌలాలంపూర్ లోని జాతీయ ప్యాలెస్ లో బుధవారం జరిగిన కార్యక్రమంలో మలేషియా దక్షిణ రాష్ట్రమైన జోహోర్ కు చెందిన సుల్తాన్ ఇబ్రహీం దేశ నూతన రాజుగా ప్రమాణ స్వీకారం చేశారు. మలేషియాలో ఇంకా రాచరికం కొనసాగుతున్నప్పటికీ అది ఉత్సవ విగ్రహ పాత్రనే పోషిస్తుంది. కానీ కొన్ని సంవత్సరాల కిందట నుంచి దాని ప్రభావం కూడా పెరిగింది. ఇక్కడి రాజుకు విచక్షణాధికారాలు ఉంటాయి. రాజకీయ అస్థిరతను అణచివేయడానికి ఆ అధికారులు ఇటీవల ఉపయోగపడుతున్నాయి.
దేవాలయాలు పిక్నిక్, టూరిస్ట్ స్పాట్ కాదు - హిందూయేతరుల ప్రవేశంపై మద్రాస్ కోర్టు
మలేషియాలో ప్రత్యేకమైన రాచరిక వ్యవస్థ అమల్లో ఉంది. తొమ్మిది రాజకుటుంబాల అధిపతులు ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒక సారి రాజుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరిని ‘‘యాంగ్ డి-పెర్టువాన్ అగోంగ్’’ అని పిలుస్తారు.
వాహనదారులకు బిగ్ అలెర్ట్.. నేడే చివరి తేదీ..
తాజాగా రాజుగా మారిన 65 ఏళ్ల సుల్తాన్ ఇబ్రహీం..అల్ సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా స్థానంలో బాధ్యతలు చేపట్టారు. ఆయన పహాంగ్ కు నాయకత్వం వహిస్తూ ఇటీవలే తన ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే రాచరికం ఎక్కువగా రాజకీయాలకు అతీతంగా కనిపించినప్పటికీ.. సుల్తాన్ ఇబ్రహీం ముక్కుసూటి మనషిగా, బహిరంగ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా పేరుగాంచారు. ఆయన తరచు దేశ రాజకీయ సమస్యలపై దృష్టి నిలిపేవారు.
దారుణం.. మాల్దీవుల ప్రాసిక్యూటర్ జనరల్ పై కత్తితో దాడి..
భారీగా విలాసవంతమైన కార్లు, మోటారు సైకిళ్లను తన కలెక్షన్ లో ఉంచుకునే ఆయనకు రియల్ ఎస్టేట్ నుండి మైనింగ్ వరకు విస్తృతమైన వ్యాపారాలు ఉన్నాయి. జోహోర్ వద్ద 100 బిలియన్ డాలర్ల చైనా మద్దతుతో భూ పునరుద్ధరణ, డెవలప్ మెంట్ ప్రాజెక్టులో సుల్లాన్ ఇబ్రహీంకు ఫారెస్ట్ సిటీలో వాటా కూడా ఉంది.