ఆఫ్ఘనిస్తాన్.. ఉగ్రవాదం.. డ్రగ్స్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మ్యాక్రన్‌తో ప్రధానమంత్రి మోడీ సంభాషణ

By telugu teamFirst Published Sep 21, 2021, 7:03 PM IST
Highlights

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మ్యాక్రన్‌తో ఫోన్‌లో సంభాషించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, ఇక్కడి ప్రాంతంలో దాని పర్యవసానాలపై చర్చించారు. టెర్రరిరం, డ్రగ్స్, అక్రమ ఆయుధాల రవాణా వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ: భారత ప్రదాని నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మ్యాక్రన్‌ ఇండో పసిఫిక్ రీజియన్‌లో ఆందోళనకర పరిస్థితులపై చర్చించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిణామాలు, ఈ ఏరియాలో దాని పర్యవసానాలపై మాట్లాడుకున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదం పెరగడం, డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణాలపై ఉభయ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఫ్రాన్స్ అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడినట్టు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. మానవ హక్కులు, మహిళలు, మైనార్టీల హక్కులకు ఉన్న ముప్పునూ ఈ సందర్భంగా వారు చర్చించినట్టు తెలిపింది.

ఇండో పసిఫిక్ రీజియన్‌లో ఉభయ దేశాల ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ రీజియన్‌లో భద్రత, సుస్థిరతకు దోహదపడే భారత్, ఫ్రాన్స్ మైత్రిపై మాట్లాడినట్టు కేంద్రం తెలిపింది. ఇరుదేశాలు అత్యంత విలువనిచ్చే ఈ ద్వైపాక్షిక సంబంధాలపై తరుచూ చర్చించడానికి అంగీకరించాయని వివరించింది.

ఫ్రాన్స్‌తో 2016లో ఆస్ట్రేలియా కుదుర్చుకున్న 40 బిలియన్ డాలర్ల సబ్‌మెరైన్ కొనుగోలు కాంట్రాక్ట్‌ను ఇటీవలే రద్దు చేసుకుంది. దీనిపై ఫ్రాన్స్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నది. అమెరికా కూడా వెన్నుపోటు పొడించిందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల నుంచి దౌత్యవేత్తలను ఫ్రాన్స్ వెనక్కి పిలుచుకుంది.

click me!