భార ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్తున్నారు. మంగళవారం ఈ పర్యటన ఉంది. ఇందులో భాగంగా మోదీ, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ కానున్నారు. ఇందులో భాగంగా పలు కీలక ఒప్పందాలపై చర్చలు జరపనున్నారు. మోదీ టూర్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రధాని మోదీ రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటనకు వెళ్తున్నారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ అవుతారు. ఆర్థిక, రక్షణ రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. మోదీ మంగళవారం మధ్యాహ్నం జెడ్డా నగరానికి చేరుకుంటారు.
హజ్ యాత్ర సందర్భంగా, సౌదీ రాజకుటుంబం రియాద్ నుంచి జెడ్డాకు మారింది. జెడ్డాలోని రాయల్ ప్యాలెస్‌లో మోదీకి గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తారు. మోదీ, క్రౌన్ ప్రిన్స్ ఇరు దేశాల స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. ఆర్థిక, రక్షణ, మీడియా, వినోదం, ఆరోగ్యం, పర్యాటక రంగాలపై చర్చలు జరుపుతారు.
మోదీ ఏప్రిల్ 22న రెండు రోజుల పర్యటనకు జెడ్డా వెళ్తున్నారు. ఉదయం 9 గంటలకు (IST) ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:40 (స్థానిక కాలమానం)కి జెడ్డా చేరుకుంటారు. సాయంత్రం భారతీయ సమాజంతో సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:30 వరకు క్రౌన్ ప్రిన్స్‌తో భేటీ అవుతారు. ఈ సందర్అభంగా రక్షణ, ఇంధనం, పెట్టుబడులు, మీడియా, ఆరోగ్యం, పర్యాటకం వంటి రంగాలపై చర్చిస్తారు.
ఈ పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
భారత్, సౌదీ అరేబియా మధ్య తొలిసారిగా ఉమ్మడి ఆయుధ తయారీపై ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం పెరిగింది. ఇరు దేశాల సైన్యాలు సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా చర్చలు జరపున్నారు.