జెడి వాన్స్ ఫ్యామిలీకి ప్రధాని మోదీ ఆత్మీయ స్వాగతం... భేటీలో చర్చించే అంశాలివేనా?

ప్రధాని మోడీ అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్, పిల్లలను ఢిల్లీలోని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వాన్స్ కుటుంబం భారత్ కు చేరుకుంది... అత్తవారి దేశంలో వాన్స్ కు అపూర్వ గౌరవం దక్కుతోంది. 

 

Google News Follow Us

JD Vance India Visit : అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కుటుంబసమేతంగా ఇండియాకు విచ్చేసారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్‌లో వారికి ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యం ఏర్పాటుచేసారు. తన అధికారిక నివాసానికి విచ్చేసిన జె.డి. వాన్స్ కుటుంబాన్ని దగ్గరుండి రిసీవ్ చేసుకున్నారు... వారి పిల్లల చేతులు పట్టుకుని లోపలికి తీసుకెళ్లారు ప్రధాని.  అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ తొలిసారి భారత్ లో పర్యటిస్తున్నారు... వారి కుటుంబానికి ఏలోటు రాకుండా ఏర్పాటు చేసారు.  

భారతదేశం అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని వేగవంతం చేయాలని చూస్తున్న కీలక సమయంలో ప్రధాని మోడీ, జె.డి. వాన్స్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరుగుతోంది. ఇద్దరు నేతలు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలోని సమస్యలతో పాటు అమెరికా-భాారత్ మధ్య వాణిజ్య సంబంధం, టారీప్స్ అంశంపై చర్చించనున్నారు. 

 

 

డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొన్ని దేశాలపై పెంచిన సుంకాలను మూడు నెలల పాటు నిలిపివేసారు. ఇందులో భారత్ కూడా ఉంది. ఈ క్రమంలోనే టారీఫ్స్ విషయంలో అమెరికా పునరాలోచన చేయాలని... తమ దేశానికి మినహాయింపు ఇవ్వాలని కోరుతోంది. ఈ క్రమంలో మోదీ, వాన్స్ భేటీ కీలకంగా మారింది. ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, మార్కెట్ యాక్సెస్‌ను మెరుగుపరచడం, వివాదాలను పరిష్కరించడం లక్ష్యంగా ఒప్పందంలోని కీలక నిబంధనలను ఖరారు చేయడంపై చర్చలు కేంద్రీకృతమై ఉంటాయి.

ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి, అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ఆర్థిక డైనమిక్స్ మధ్య ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ భేటీ కీలకమైనదిగా రెండు దేశాలు భావిస్తున్నాయి. ఏప్రిల్ 21 నుండి 24 వరకు జరిగే ఈ పర్యటన ప్రపంచ దౌత్యంలో కీలకం కానుంది. ఇండో-పసిఫిక్ మరియు ఇతర ప్రాంతాలలో ఆర్థిక, వ్యూహాత్మక విధానాలు రూపొందించడంలో భారత-అమెరికా భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తోంది.

సోమవారం ఉదయం అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ఉదయం 9:30 గంటల ప్రాంతంలో పాలంలోని వైమానిక దళ స్టేషన్‌కు చేరుకున్నారు. గార్డ్ ఆఫ్ ఆనర్ వేడుకతో ఆయనకు స్వాగతం పలికారు. ఆయనకు న్యూఢిల్లీ ఇచ్చే ప్రాముఖ్యతను ఇది సూచిస్తుంది.

ప్రధాని మోడీతో ఆయన సమావేశంలో వాణిజ్య పునర్నిర్మాణం, ప్రాంతీయ భద్రత, ఇండో-పసిఫిక్‌లో సమన్వయం వంటి అనేక వ్యూహాత్మక, ఆర్థిక అంశాలు చర్చించనున్నట్లు సమాచారం. అమెరికా-చైనా ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి.

అధికారిక చర్చలకు ముందు వాన్స్ కుటుంబాన్ని తన నివాసానికి ఆహ్వానించడం ద్వారా ప్రధాని మోడీ రెండు ప్రజాస్వామ్య దేశాల అగ్ర నాయకుల మధ్య లోతైన వ్యక్తిగత సంబంధాన్ని నొక్కిచెప్పారు. భారతీయ మూలాలున్న ఉషా వాన్స్ కూడా భారతీయ మీడియా, ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఈ జంట, వారి పిల్లల చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడ్డాయి.

న్యూఢిల్లీ నుండి ఉపాధ్యక్షుడు వాన్స్ మంగళవారం జైపూర్‌కు, బుధవారం ఆగ్రాకు వెళ్లి తన పర్యటనను ముగించనున్నారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని కొత్త అమెరికా ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడిగా వాన్స్ కొనసాగుతున్నారు. అమెరికా-భారత్ సంబంధాలు ఎలా ఉండనున్నాయో వాన్స్ పర్యటన స్ఫష్టం చేయనుంది. 

 

Read more Articles on