PM Modi: నేను శక్తిమంతుడినని అనుకోను. నేను ఒక సేవకుడిని మాత్రమే: లెక్స్ ఫ్రిడ్‌మన్ పాడ్‌కాస్ట్‌లో మోదీ

అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మన్‌తో మోదీ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చాలా విషయాల గురించి మాట్లాడారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలోని పలు ముఖ్య అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


PM Modi in lex fridman podcast అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మన్‌తో మోదీ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చాలా విషయాల గురించి మాట్లాడారు. దాదాపు మూడు గంటల ముచ్చట్లలో మోదీ దేశం, ప్రపంచం గురించి చాలా విషయాలు చెప్పారు. తన చిన్నప్పటి కథల నుంచి ఆధ్యాత్మిక యాత్ర వరకు, ట్రంప్, పాకిస్తాన్, ఐక్యరాజ్యసమితి వరకు అన్ని విషయాల గురించి మాట్లాడారు. మోదీతో మాట్లాడిన ముఖ్యాంశాలు ఇప్పుడు తెలుసుకుందాం...

  • నా బలం నా పేరులో లేదు, 140 కోట్ల మంది భారతీయులు, వేల ఏళ్ల సంస్కృతి, వారసత్వం నాకు అండగా ఉన్నాయి. నేను ఏ ప్రపంచ నాయకుడితో చేయి కలిపినా అది మోదీ కాదు, 140 కోట్ల మంది భారతీయులు కలుపుతున్నట్లు.
  • మనం శాంతి గురించి మాట్లాడితే ప్రపంచం వింటుంది. భారతదేశం గౌతమ బుద్ధుడి పుణ్యభూమి. భారతీయులకు గొడవలు, ఘర్షణలు అంటే ఇష్టం ఉండదు. మేము శాంతిని కోరుకుంటాం.
  • రష్యా, ఉక్రెయిన్ (Modi on Russia Ukraine War) రెండింటితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నేను రష్యా అధ్యక్షుడు (వ్లాదిమిర్) పుతిన్‌తో మాట్లాడి ఇది యుద్ధం సమయం కాదని చెప్పగలను. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కూడా స్నేహంగా మాట్లాడగలను. ప్రపంచంలో ఎంత మంది నీకు మద్ధతుగా ఉన్నా యుద్ధంతో పరిష్కారం దొరకదు. ఉక్రెయిన్, రష్యా ఇద్దరూ చర్చలకు వస్తేనే పరిష్కారం దొరుకుతుంది.
  • నేను ప్రధాని అయినప్పుడు పాకిస్తాన్‌ను ప్రత్యేకంగా పిలిచి ప్రమాణ స్వీకారోత్సవం చేశాను. కొత్తగా మొదలుపెడదామని అనుకున్నాను. అయినా శాంతి కోసం చేసిన ప్రయత్నాలను వాళ్లు పట్టించుకోలేదు (Modi on Pakistan Terrorism). వాళ్లకు మంచి బుద్ధి వస్తుందని, శాంతి మార్గాన్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నాను.
  • నన్ను ఏదో పని కోసం ఒక శక్తి పంపింది. నేను ఒక్కడినే కాదు, నన్ను పంపిన ఆ శక్తి ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఈ నమ్మకం మనలో ఉండాలి. కష్టాలు మన ఓపికకు పరీక్ష పెడతాయి. అవి నన్ను ఓడించడానికి కాదు, నన్ను బలంగా చేయడానికి వస్తాయి.
  • అమెరికా అధ్యక్షుడు (డొనాల్డ్) ట్రంప్‌ను ఆయన మొదటిసారి, ఇప్పుడు రెండోసారి కూడా చూశాను. ఈసారి ఆయన మునుపటి కంటే బాగా సిద్ధమైనట్లు ఉన్నారు. ఆయనకు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది.
  • హౌడీ మోడీ కార్యక్రమంలో ట్రంప్ తన ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నారని, భద్రతా సిబ్బంది వద్దని వారించినా ప్రేక్షకులకు అభివాదం చేయడానికి స్టేడియం చుట్టూ తిరిగారని మోదీ (Modi on Trump Relations) చెప్పారు. ట్రంప్‌నకు తనపై ఉన్న నమ్మకాన్ని ఆయన మెచ్చుకున్నారు. ట్రంప్‌తో తనకున్న మంచి సంబంధాల గురించి మాట్లాడుతూ, ట్రంప్ 'అమెరికా ఫస్ట్' విధానం, నా 'భారత్ ఫస్ట్' ఒకటేనని అన్నారు.
  • భారత్, చైనా ఆరోగ్యకరంగా పోటీ పడాలని మేము కోరుకుంటున్నాం. పోటీ మంచిదే కానీ అది గొడవకు దారితీయకూడదు. మా సహకారం లాభదాయకం మాత్రమే కాదు, ప్రపంచ శాంతికి కూడా అవసరం.
  • నాకు ప్రజాస్వామ్యం అంటే ఇష్టం. అందుకే అమెరికా అంటే నాకు చాలా ఇష్టం. కానీ భారతదేశంలో ఉన్నంత అందమైన ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు. PM Modi on Global Peace in Lex Fridman Podcast
  • గోద్రా అల్లర్లు ఊహించలేని విషాదం. ప్రజలను సజీవంగా కాల్చి చంపారు. కాందహార్ విమానం హైజాక్, పార్లమెంటుపై దాడి లేదా 9/11 వంటి సంఘటనల నేపథ్యంలో ప్రజలను చంపడం, సజీవంగా కాల్చడం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి. అప్పుడు పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా, అస్థిరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది అందరికీ బాధాకరమైన విషయం. అందరూ శాంతిని కోరుకుంటారు. కానీ అప్పటివరకు జరిగిన అల్లర్లలో అదే పెద్దదని అనుకోవడం తప్పు. 2002కు ముందు డేటా చూస్తే గుజరాత్‌లో 250కి పైగా అల్లర్లు జరిగాయి.
  • నేను శక్తిమంతుడినని అనుకోను. నేను ఒక సేవకుడిని మాత్రమే. నేను ప్రధాని కాదు, ప్రజల సేవకుడిని.
  • ప్రపంచం ఏఐతో ఏదైనా చేయగలదు, కానీ భారతదేశం లేకుండా అది అసంపూర్ణంగానే ఉంటుంది. నేను చాలా బాధ్యతగా ఈ మాట చెబుతున్నాను.
  • ఆటల్లో టెక్నాలజీ గురించి నాకు పెద్దగా తెలీదు. టెక్నాలజీ గురించి తెలిసిన వాళ్లే ఏది మంచిదో, ఎవరు బెస్ట్ ప్లేయరో చెప్పగలరు. కొన్నిసార్లు ఫలితాలే అన్నీ చెబుతాయి. కొన్ని రోజుల క్రితం భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. రిజల్ట్ చూస్తేనే ఏ టీమ్ గొప్పదో తెలుస్తుంది.
  • పరీక్షలను విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు చివరి అంశంగా చూడకూడదని మోదీ అన్నారు. పరీక్షా పే చర్చ ద్వారా విద్యార్థులతో నేరుగా మాట్లాడే అవకాశం తనకు వచ్చిందని, వారి సమస్యలను తెలుసుకున్నానని, విద్య గురించి వారి అభిప్రాయాలను అర్థం చేసుకున్నానని మోదీ చెప్పారు.
click me!