ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 110వ మన్ కీ బాత్ ఎపిసోడ్ లో ప్రసంగించారు. ప్రతి నెల చివరి ఆదివారంలో మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమౌతుంది.
న్యూఢిల్లీ:భారతదేశ నారీ శక్తి ప్రతి రంగంలో పురోగతిలో కొత్త శిఖరాలను తాకిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.మన్ కీ బాత్ 110 వ ఎపిసోడ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నాడు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు కూడ డ్రోన్లను ఉపయోగిస్తున్నారని మోడీ చెప్పారు. ఈ విషయాన్ని ఎవరూ ఊహించి ఉండరన్నారు. ప్రతి గ్రామంలో డ్రోన్ గురించి మహిళల్లో చర్చ జరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
also read:దేశంలో అతి పెద్ద తీగల వంతెన: ప్రారంభించిన మోడీ
నమో ద్రోణ దీదీ, నమో ద్రోణ దీదీ అని అందరి పెదవుల్లో వినిపిస్తుందన్నారు. మెల్‌ఘాట్ టైగర్ రిజర్వ్ సమీపంలోని ఖట్కలీ గ్రామంలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలు ప్రభుత్వ సహయంతో తమ ఇళ్లను హోం స్టేలుగా మార్చుకున్నాయన్నారు. ఇది వారికి ప్రధాన ఆదాయవనరుగా మారుతుందని మోడీ చెప్పారు. వన్యప్రాణులను సంరక్షించేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నట్టుగా మోడీ గుర్తు చేశారు.
also read:బుల్లెట్ కు గుడి కట్టి పూజలు: ఎందుకో తెలుసా?
ఒడిశాలోని కలహండిలో మేకల పెంపకం గ్రామ ప్రజల జీవనోపాధితో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవడానికి ప్రధాన సాధనంగా మారుతుందని మోడీ తెలిపారు. భారతీయ సంస్కృతి,సంప్రదాయాలను పరిరక్షించేందుకు అసంఖ్యాక ప్రజలు నిస్వార్థంగా కృషి చేస్తున్నారని ప్రజల సహకారాన్ని మోడీ ప్రశంసించారు.జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటకలలో పౌరుల కృషి ప్రతి ఒక్కరికి స్పూర్తినిస్తుందన్నారు.
దేశంలోని రైతులంతా ప్రకృతి సాగు వైపు మళ్లాలని మోడీ కోరారు.క్రిమి సంహారక రసాయనాల వల్ల వ్యాధులు వ్యాపిస్తున్నాయన్నారు.విష రసాయనాల వల్ల పొలాలు దెబ్బతింటున్నాయని మోడీ పేర్కొన్నారు.గ్రామాల్లోని రైతులు వ్యవస్థీకృతం కావాల్సిన అవసరం ఉందని ప్రధాని చెప్పారు.నిపుణుల సలహాలు తీసుకొని వేర్వేరు పంటలు పండించాలని మోడీ సూచించారు.గ్రామాలు, పట్టణాల్లో మార్కెటింగ్ వసతులు పెరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.యువ పారిశ్రామిక వేత్తలను అన్నిరకాలుగా ప్రోత్సహిస్తున్నామన్నారు.
also read:నడిరోడ్డుపై మహిళను వేధించిన వ్యక్తి: బుద్ది చెప్పిన ప్రయాణీకులు, సోషల్ మీడియాలో వైరల్
2014 అక్టోబర్ 3న మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రతి నెల చివరి ఆదివారం నాడు మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ పాల్గొంటున్నారు. మహిళలు, యువత, రైతులు సహా దేశంలోని పలువురితో మోడీ మాట్లాడుతున్నారు.100 కోట్ల మంది ప్రజలు కనీసం ఒక్కసారైనా కనెక్ట్ అయ్యారని అధ్యయనాలు చెబుతున్నాయి.