మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలేనని ఛత్తీస్‌ఘడ్ లో జరిగిన ఘటన నిరూపిస్తుంది.
న్యూఢిల్లీ: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అమ్మమ్మను మనవడే దారుణంగా చంపేశాడు. ఈ ఘటన చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసుల విచారణలో ఈ విషయం వెలుగు చూడడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
also read:తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు 50 మంది పేర్లు:గెలుపు గుర్రాల ఎంపికపై బీజేపీ ఫోకస్
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా బాందే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రాణి పఠారియా అనే మహిళ పేరిట ఆమె మనవడు ఆకాశ్ కోటి రూపాయాల ఇన్సూరెన్స్ చేయించాడు. ఈ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అమ్మమ్మను సుఫారీ ఇచ్చి హత్య చేయించాడు. పాముతో కాటు వేయించి అమ్మమ్మను చంపించాడు.
also read:బుల్లెట్ కు గుడి కట్టి పూజలు: ఎందుకో తెలుసా?
అయితే రాణి పఠారియా పాము కాటుతోనే మరణించిందని అంతా భావించారు. ఇన్సూరెన్స్ సొమ్ము కూడ ఆకాష్ క్లైయిమ్ చేసుకున్నాడు. అయితే ఆకాష్ ప్రవర్తనలో మార్పును స్థానికులు గుర్తించారు. దీనిపై అతడిని ప్రశ్నించారు. ఈ విషయమై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేశారు.ఈ విచారణలో పోలీసులు కీలక విషయాన్ని గుర్తించారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అమ్మమ్మను ఆకాష్ హత్య చేయించిన విషయాన్ని పోలీసలు గుర్తించారు. ఈ కేసులో ఆకాష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలేనని ఈ ఘటన రుజువు చేస్తుంది.
also read:కాంగ్రెస్‌లోకి: జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత బీఆర్ఎస్‌కు రాజీనామా
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు గతంలో వెలుగు చూశాయి. ఈ ఏడాది జనవరి 31న తూర్పు గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి ఇదే తరహాలో నాటకం ఆడారు. చివరకు పోలీసులకు చిక్కాడు.తూర్పు గోదావరి జిల్లాలోని రంగంపేట మండలం పాతవీరంపాలెంలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కేతమల్లు వెంకటేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించాడు. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. దరిమిలా వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు.వైఎస్ఆర్ జిల్లాలోని సింహాద్రిపురం మండలం బలపనూరులో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మామను చంపిన అల్లుడి ఉదంతం వెలుగు చూసింది. ఇందుకు కారణమైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.