బస్సుల్లో ఎక్కువ సౌండ్‌తో పాటలు వింటే దింపేస్తారు.. హైకోర్టు ఆదేశాలు

By telugu teamFirst Published Nov 12, 2021, 4:56 PM IST
Highlights

కర్ణాటకలో ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణిస్తూ ఎక్కువ సౌండ్‌తో పాటలు లేదా వీడియోలు ప్లే చేయడం నిషేధం. కండక్టర్ సూచించినా పట్టించుకోకుంటే సింపుల్‌గా బస్సు నుంచే దింపేసే ఆదేశాలు వచ్చాయి. కర్ణాటక హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని తెలిపింది.
 

బెంగళూరు: బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు కొందరు ఎక్కువ వాల్యూమ్‌తో మొబైల్‌లో పాటలు వినడం, వీడియోలు ప్లే చేయడం గమనిస్తుంటాం. ఒక్కోసారి Bus మొత్తం దద్దరిల్లిపోయేలా ఉంటుంది ఆ Sound. కానీ, ఎవరి దారిలో వారు వెళ్లిపోతారు. ఒకవేళ చెప్పిన వారు చెవికెక్కించుకోరు. దూరం ప్రయాణం చేసే వారు కాస్త కునుకు తీయనీకుండా ఈ శబ్దాలు డిస్టబ్ చేస్తుంటాయి. ఆ కర్ణాటక వాసి కూడా అందరిలా ఊరుకోలేదు. ఏకంగా High Courtను ఆశ్రయించాడు.

RTC బస్సుల్లో ప్రయాణం చేస్తుంటే చికాకు పెట్టే తీవ్రతతో Songs, Videos ప్లే చేస్తున్నారని, తద్వారా సహప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. రిట్ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు విచారించి ఆదేశాలు జారీ చేసింది. ఇకపై నుంచి కర్ణాటక రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువ సౌండ్‌తో పాటలు, వీడియోలు ప్లే చేయరాదని స్పష్టం చేసింది. బస్సుల్లో సహ ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ అధిక మోతాదులో శబ్దాలతో పాటలు వినడాన్ని హైకోర్టు నిషేధించింది.

Also Read: స్టాప్‌లో బస్సు ఆగలేదని ప్యాసింజర్ పిటిషన్.. రూ. 8 వేల పరిహారం చెల్లించాలని ఆర్టీసీకి కోర్టు ఆదేశాలు

బస్సులోని అధికారులు ప్రయాణికులను ఎక్కువ శబ్దాలతో పాటలు, వీడియోలు ప్లే చేయకుండా రిక్వెస్ట్ చేయాలని హైకోర్టు సూచించింది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా తక్కువ మోతాదులోనే పాటలు, వీడియోలు ప్లే చేసుకోవాలని సూచించాలని పేర్కొంది. ఒకవేళ ఆ ప్రయాణికుడు ఈ సూచనలకు ససేమిరా అంటే.. ఆయనను బస్సు నుంచి దింపేయవచ్చు అని హైకోర్టు తెలిపింది.

గతంలో కర్ణాటకలోనే ఆర్టీసికి సంబంధించి విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సు.. స్టాప్‌లో ఆపకుండా అరకిలోమీటర్ దూరంలో ఆగింది. దీంతో ఆ మహిళా ప్యాసింజర్‌కు ఇల్లు చేరడం కష్టమైంది. తనకు కలిగిన అసౌకర్యానికి ఆమె వినియోగదారుల కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు ఆర్టీసి తీరును తప్పుబట్టింది. ఆమెకు రూ. 8వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కర్ణాటకలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తుమకూరు జిల్లా ఉర్దిగెరె హుబ్లీకి చెందిన విజయ బాయి కర్ణాటక ఆర్టీసీపై ఫిర్యాదు చేశారు.

click me!