Sharmistha panoli: శర్మిష్టకు మద్ధతిచ్చిన పవన్.. ఇంతకీ ఎవరీ శర్మిష్ట, దేశవ్యాప్తంగా ఎందుకు చర్చ నడుస్తోంది?

Published : Jun 02, 2025, 11:31 AM ISTUpdated : Jun 02, 2025, 11:34 AM IST
Pawan Kalyan Sharmistha Panoli

సారాంశం

శర్మిష్ట పనోలి.. గత కొన్ని రోజులుగా ఈ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. తాజాగా శర్మిష్టకు మద్ధతుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా శర్మిష్ట గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. 

శర్మిష్ట పనోలి ఎవరు?

శర్మిష్ట పనోలి హర్యానాలోని గుర్గావ్ ప్రాంతంలో నివసిస్తుంది. ప్రస్తుతం ఆమె పుణెలో న్యాయశాస్త్ర విద్యనభ్యసిస్తున్నారు. 22 ఏళ్ల వయస్సులోనే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రభావం చూపుతున్న ఈ యువతి, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరుస్తూ వస్తోంది. ఆమెకు దాదాపు రెండు లక్షల ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల ఆమె పెట్టిన ఓ పోస్ట్ వల్ల దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

ఆమె పోస్ట్ వెనుక కథ ఏమిటి?

దేశంలో ఉగ్రదాడులకు వ్యతిరేకంగా నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” అనంతరం బాలీవుడ్ మౌనం పై శర్మిష్ట ఓ విమర్శాత్మక పోస్ట్‌ చేశారు. ఉగ్రవాదంపై బాలీవుడ్ ఎందుకు స్పందించట్లేదు? మత ఛాందసవాదంపై ఎవరు మాట్లాడట్లేదు? అనే ప్రశ్నలను ఆమె సంధించారు. ఈ పోస్ట్‌లో కొంత తీవ్రమైన పదజాలం ఉండటంతో విమర్శలు వచ్చాయి. శర్మిష్ట వెంటనే స్పందించి పోస్ట్‌ను డిలీట్ చేయడంతో పాటు, క్షమాపణలు కూడా చెప్పింది.

శర్మిష్ట అరెస్ట్..

కానీ ఆమెపై ట్రోలింగ్ మాత్రం ఆగలేదు. ఈ క్రమంలోనే బెంగాల్ రాష్ట్రంలోని ఓ పోలీస్ స్టేషన్లో ఆమె వ్యాఖ్యలపై ఫిర్యాదు నమోదు చేశారు. దీంతో వెంట‌నే స్పందించిన బెంగాల్ పోలీసులు హ‌ర్యానా వెళ్లి ఆమెను అరెస్ట్ చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాలనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ‌స్తున్నాయి.

పవన్ కళ్యాణ్ స్పందన..

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. “ఐ స్టాండ్ విత్ శర్మిష్ట”, “ఈక్వల్ జస్టిస్” అనే హ్యాష్ ట్యాగ్‌లతో పోస్టు చేస్తూ, మమతా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక సామాన్య విద్యార్థిని చేసిన వ్యాఖ్యలపై వేగంగా చర్యలు తీసుకుంటూ, భారీ దూషణలు చేసిన నేతలపై మౌనం ఎందుకు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. లౌకికవాదం ఒక వర్గానికి రక్షణ కవచంలా, మరొక వర్గానికి శిక్షణ సాధనంలా ఉండకూడదని హెచ్చరించారు.

 

 

యువ‌తిని వేధించ‌డం దారుణం: కంగ‌నా

ఈ ఘటనపై కంగనా రనౌత్ కూడా స్పందించారు. శాంతి భద్రతల పేరిట ఒక యువతిని వేధించడం దారుణమని ఆమె పేర్కొన్నారు. క్షమాపణ చెప్పి పోస్ట్ తొలగించిన తర్వాత కూడా ఆమెను అరెస్ట్ చేయడం దుర్మార్గమని, ఆమె జీవితాన్ని నాశనం చేయడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. శర్మిష్టకు ఒక సామాన్య యువతిగా స్వేచ్ఛ ఉండాలన్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu