Jagannath chariot: దేవుని రథానికి, యుద్ధ విమాన టైర్లు.. అరుదైన సంఘ‌ట‌న

Published : Jun 02, 2025, 10:50 AM ISTUpdated : Jun 02, 2025, 10:52 AM IST
Jagannath chariot: దేవుని రథానికి, యుద్ధ విమాన టైర్లు.. అరుదైన సంఘ‌ట‌న

సారాంశం

20 ఏళ్ల తర్వాత తొలిసారి ఇస్కాన్ జగన్నాథ రథ చక్రాలు మార్చారు. సాధారణంగా రథానికి చెక్క, రాయి చక్రాలను ఉపయోగించే వారు. అయితే తొలిసారి వీటికి బదులు సుఖోయ్ జెట్ చక్రాలు అమర్చారు.

దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇస్కాన్ జగన్నాథ రథం చక్రాలను మార్చారు. అప్పటి వరకు చెక్క, రాయి చక్రాలను ఉపయోగించగా అనంతరం బోయింగ్ విమాన చక్రాలను ఉపయోగించారు. అయితే ఇప్పుడు వీటి స్థానంలో యుద్ధ విమానాల టైర్లు రానున్నాయి. సుఖోయ్ జెట్ చక్రాలను రథానికి అమరుస్తున్నారు. 

జూన్ 27న రథయాత్ర ఉన్న నేపథ్యంలో కొత్త చక్రాలు అమరుస్తున్నారు. 1972లో చిన్న రథంతో యాత్ర మొదలైంది. 5 ఏళ్ల తర్వాత భక్తులు మూడు రథాలు ఇచ్చారు. అనంతరం జగన్నాథ రథానికి బోయింగ్ చక్రాలు అమర్చారు. అవి పాడవ్వడంతో 2005లో మార్చాలనుకున్నారు.

ఈ టైర్లు ఎందుకు.? 

రథం బరువు భారీాగా ఉండడంతో చక్రాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ రథం బరువు సుమారు 9 టన్నులు ఉంటుంది. అలాగే భక్తులతో పాటు మొత్తం 16 టన్నులు అవుతుంది. దీంతో ఇంత బరువును తట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక చక్రాలను అమరుస్తారు. 

2018లో సుఖోయ్ టైర్లను తయారుచేసే MRFని చక్రాల కోసం అడిగారు. 6 ఏళ్ల తర్వాత 2024లో వారు చక్రాలు ఇచ్చారు. దీనిపై ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారామన్ దాస్ సంతోషం వ్యక్తం చేశారు. ఇలా దేవుడి రథానికి యుద్ధ విమాన టైర్లను అమర్చడం అందరినీ ఆకర్షిస్తోంది. 

ధర ఎంతో తెలుసా.? 

నిజానికి తొలిసారి ఎమ్ఆర్ఎఫ్ సంస్థను ఈ విషయం తొలిసారి సంప్రదించగా.. భారత వాయుసేనకు మాత్రమే ఈ టైర్లను సరఫరా చేస్తామని తెలిపారు. అయితే సమస్యను తెలియజేయడంతో టైర్లు ఇవ్వడానికి అంగీకరించారు. ఇందులో భాగంగానే నాలుగు టైర్లను డెలివరీ చేశారు. వీటి ధర రూ. 1.80 లక్షల రూపాయలని తెలుస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?