Jee Advanced Results: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు వచ్చేశాయి..ఫలితాలు ఇక్కడ చూసుకోండి!

Published : Jun 02, 2025, 09:19 AM ISTUpdated : Jun 02, 2025, 09:20 AM IST
Maharashtra Board Results 2025

సారాంశం

JEE అడ్వాన్స్‌డ్ 2025 ఫలితాలు  విడుదలయ్యాయి. విద్యార్థులు jeeadv.ac.inలో లాగిన్ అయి స్కోర్‌కార్డ్‌ను చూసుకోవచ్చు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నిర్వహించిన JEE అడ్వాన్స్‌డ్ 2025 ఫలితాలను  జూన్ 2, 2025న అధికారికంగా విడుదల చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫలితాలను jeeadv.ac.in వెబ్‌సైట్‌లో ఉంచారు. పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి స్కోర్‌కార్డ్‌ను చూసుకోవచ్చు.

ఈ ఏడాది JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష మే 18, 2025న ఆదివారం నాడు జరిగింది. పరీక్ష ముగిసిన కొన్ని రోజుల తరువాత ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల కాగా, ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ కీతో పాటు ఫలితాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. అభ్యర్థులు ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు అడ్మిషన్ల ప్రక్రియలకు ఉపయోగించుకోవచ్చు.

https://results25.jeeadv.ac.in/ వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలు, స్కోర్లు, ర్యాంక్ వంటి సమాచారాన్ని స్కోర్‌కార్డ్ రూపంలో చూడవచ్చు. ఇది దేశంలోని ప్రఖ్యాత IITలు, NITలు,  ఇతర టెక్నికల్ సంస్థల్లో ప్రవేశం పొందేందుకు కీలకంగా మారుతుంది.

ఫలితాల విడుదలతో పాటు, జూన్ 10 నుంచి JEE అడ్వాన్స్‌డ్ ఆధారిత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సమాచారం. విద్యార్థులు తమ స్కోర్ల ఆధారంగా ఇష్టమైన కాలేజీలు,  కోర్సుల కోసం ఎంపిక చేయగలుగుతారు.

ఇప్పటికే IIT కాన్పూర్ అధికారికంగా తెలిపిన ప్రకారం, ఫలితాలు చూసేందుకు jeeadv.ac.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, అక్కడ ‘JEE Advanced 2025 Result’ లింక్‌పై క్లిక్ చేయాలి. అనంతరం అభ్యర్థులు తమ రోల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ , రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ వంటి వివరాలు ఇచ్చి లాగిన్ అయితే, స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ఇప్పటి వరకు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా ఫలితాల ప్రాసెస్ కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఇక కౌన్సెలింగ్ వివరాలు, తదుపరి అడ్మిషన్ షెడ్యూల్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Facts: విమానాలు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి.? ఎప్పుడైనా ఆలోచించారా.?
Indian Army: రూ. 6000 కోట్ల‌తో బిగ్ ప్లాన్‌.. నిశ్శ‌బ్ధ ఆయుధాన్ని త‌యారు చేస్తున్న భార‌త్