పాకిస్థాన్ దౌత్యవేత్తలు లైంగిక జీవితంపై ప్రశ్నలడిగారు- భారతీయ మహిళ ఆరోపణ.. విచారణ ప్రారంభించిన ఆ దేశ ప్రభుత్వం

By team teluguFirst Published Jan 13, 2023, 12:22 PM IST
Highlights

వీసా కోసం పాకిస్థాన్ కాన్సులేట్ ఆఫీసుకు వెళ్లిన సమయంలో అక్కడి అధికారులు తనపై అనుచితంగా ప్రవర్తించారని, తన లైంగిక జీవితానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారని ఓ భారతీయ మహిళ ఆరోపించింది. ఇది తనకు ఇబ్బందికరంగా అనిపించిందని తెలిపారు. 

2022లో వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఢిల్లీలోని పాకిస్థాన్ కాన్సులేట్‌ను సందర్శించిన సమయంలో అక్కడి సిబ్బంది తనపై అనుచితంగా ప్రవర్తించారని, అవాంఛనీయ లైంగిక అభియోగాలకు పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించింది. ఈ మేరకు బాధిత మహిళ ముందుకు వచ్చి ‘న్యూస్ 18’తో మాట్లాడారు. పాకిస్థాన్ లోని ఓ వర్సిటీలో ఉపన్యాసం ఇవ్వాలని ఆ దేశం తనను ఆహ్వానించిందని, అందుకే తాను అక్కడి వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అయితే వీసా కోసం ఎంబసీకి తొలిసారిగా వెళ్లిన సమయంలో, ఈద్ తర్వాత మేలో రావాలని సూచించారని అన్నారు. 

భోజనంలో మత్తుమందు కలిపి మహిళపై అత్యాచారం..

అయితే వీసా దరఖాస్తును తాను ప్రాసెస్ చేస్తానని కాన్సులేట్‌లోని మరో అధికారి తనకు చెప్పారని ఆమె అన్నారు. ఆ అధికారి తనను వేరే గదికి తీసుకెళ్లి మొదట సాధారణ ప్రశ్నలు అడిగారని, ఆపై తన వైవాహిక స్థితి, లైంగిక జీవితం గురించి ప్రశ్నలు అడుగుతూ హద్దు దాటారని ఆమె ఆరోపించారు. ‘‘అతడు నన్ను లైంగిక జీవితం గురించి అడిగాడు. అది నాకు అసౌకర్యంగా అనిపించింది’’ అని ఆమె చెప్పినట్టు ‘న్యూస్ 18’ తెలిపింది. ఇదే సమయంలో ఇద్దరు పాకిస్తాన్ అధికారులు ఖలిస్తాన్ ఉద్యమం, కాశ్మీర్ తీర్మానం విషయంపై మాట్లాడటం ప్రారంభించారని, ఈ విషయం నుండి సంభాషణను పూర్తిగా నడిపించారని ఆమె ఆరోపించారు.

ఆగ్రాకు వచ్చిన ఇద్దరు పర్యాటకులకు కరోనా పాజిటివ్.. రిపోర్టు రాకముందే ప్ర‌యాణంతో ఆందోళ‌న‌

ఈ ఘటన జరిగిన సుమారు ఒక నెల తర్వాత బాధిత మహిళ సంబంధిత అధికారుల నుండి వాట్సప్ నుంచి సందేశాలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తూ వ్యాసాలు రాస్తే డబ్బులు ఇస్తానని అందులో ఇద్దరు వ్యక్తులు ఆఫర్ ఇచ్చారని ఆమె తెలిపారు. వారిద్దరు మెసేజ్ లను ఒకే సారి పంపించి, డిలీట్ చేస్తూ వెళ్లారని, కానీ తాను స్క్రీన్ షాట్లను క్యాప్చర్ చేశానని బాధిత మహిళ చెప్పారు. 

స్పందించిన పాక్ విదేశాంగ శాఖ
ఈ ఘటనపై పాక్ విదేశాంగ శాఖ స్పందించింది. ఢిల్లీలోని తమ కాన్సులేట్‌లో అధికారి ఒకరు భారతీయ మహిళపై అనుచితంగా ప్రవర్తించారనే వార్తలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. వీసా, కాన్సులర్ దరఖాస్తుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని ఆ దేశ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో నొక్కి చెప్పింది. దౌత్య సిబ్బంది వృత్తిపరంగా వ్యవహరించాలని సూచించింది. పాకిస్తాన్ రాయబార కార్యాలయాలను సందర్శించే వ్యక్తుల దురుసుగా ప్రవర్తిస్తే సహించబోమని పేర్కొంది.

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: ప్రైవేట్ బస్సు, లారీ ఢీకొని 10 మంది మృతి

అయితే బాధిత మహిళ ఆరోపణలు చేసిన సమయం, విధానంపై ఆ దేశ  మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజా ఫిర్యాదులను స్వీకరించడానికి, పరిష్కరించడానికి పలు పద్దతులు ఉన్నాయని నొక్కి చెప్పారు. కాగా.. ఈ ఘటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతకు కారణమైంది. దర్యాప్తు కొనసాగుతోంది. 
 

click me!