Supreme Court: పెళ్లికూతురుకు తన పుట్టింటి వారు పెళ్లి సమయంలో బహుమతిగా ఇచ్చే కట్నంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Supreme Court: సుప్రీం కోర్టు ఏదో ఒక విషయంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త తీర్పును ఇస్తూనే ఉంటుంది. అలాగే ఇటీవల కుటుంబ వ్యవహారాలకి సంబంధించిన ఓ సంచలన తీర్పును ఇచ్చింది. కుంటుంబంలో జరిగే కొన్ని గొడవల కారణంగా చాలా కుటుంబాలు కోర్టు మెట్లు ఎక్కాల్సివస్తుంది. ఈ కేసులకు సంబంధించిన న్యాయస్థానం సుదీర్ఘ విచారణ చేసి కీలకమైన తీర్పులు ఇస్తాయి. ఆ తీర్పుల్లో కొన్ని భార్యకు అనుకూలంగా ఉంటే మరికొన్ని భర్తలకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఇప్పుడు స్త్రీలకు అనుకూలంగా సుప్రీం ఓ కీలక తీర్పు వెలువరిచింది. మరి ఆ తీర్పు వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వివాహం అంటేనే ఎన్నో సాంప్రదాయాలు, పద్దతులు, లాంఛనాలతో కూడుకున్నది. పెళ్లి తంతులో కొన్ని కొన్ని ప్రాంతాలను బట్టి కొన్ని సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. అలాగే వధువు, వరుడు తరుఫున పాటించాల్సిన పద్దతులను కూడా పాటిస్తారు. ఈ సాంప్రదాయంలో స్త్రీకి పుట్టింటి వాల్లు స్త్రీ ధనాన్ని ఇవ్వడం ఒకటి. అయితే అది అనాదిగా వరకట్నంగా రూపం దాల్చింది. వధువును వివాహం చేసుకునేందుకు వరుడు వరకట్నం రూపంలో కొంత సొమ్మును తీసుకోవడం. అయితే కొంతమంది భర్తలు భార్యలు తెచ్చిన కట్నం ఆ వధువు పేరిట ఫిక్స్ చేస్తే మరికొంతమంది మాత్రం ఆ కట్నం పై పెత్తనం చేస్తూ ఉంటారు.
అయితే ఇదే విషయం పై సుప్రీం కోర్టు తాజాగా ఓ కీలక తీర్పు ఇచ్చింది. భార్య తెచ్చే కట్నం పై భర్తకు ఎలాంటి హక్కు ఉండదని తేల్చేసింది. ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో వాటిని వాడుకున్నా మళ్లీ అవి ఆ వధువుకే తిరిగి ముట్టచెప్పాలని సుప్రీంకోర్టు తేల్చేసింది. గురువారం ఓ కేసును విచారించిన సుప్రీం మహిళ బంగారాన్ని వాడుకున్న భర్త తనకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
కేరళకు చెందిన ఓ మహిళకు పెళ్లి సమయంలో పుట్టింటివారు 89 గ్రాములు బంగారాన్ని ఇచ్చింది. అయితే ఆ మహిళ భర్త కొన్ని అవసరాలకోసం తన భర్యా నగలను వాడుకున్నాడని ఫ్యామిలీ కోర్టులో అప్పీల్ చేసుకుంది. పెళ్లైన మొదటిరోజే తన అత్తకు తన బంగారాన్ని భర్త ముట్టచెప్పాడని ఇలా ఎందుకు చేశారని భర్తను ప్రశ్నిస్తే జాగ్రత్త చేయడానికని చెప్పాడని తెలిపింది. బంగారంతో పాటు తన హక్కుల్ని లాక్కున్నారని నవవధువు ఆరోపించింది. వధువు నగతలో అత్తింటివారు అప్పు తీర్చుకున్నారని తెలిపింది.
తన బంగరం ఇవ్వమని భార్య అడిగితే అత్త, భర్త బెదిరించారని దీంతో ఏం చేయలేని స్థితిలో ఆమె 2011లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. అయితే ఆ మహిళ భర్త చేసింది ముమ్మాటికి తప్పుచేశాడంటూ కోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పు నచ్చని భర్త దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే అక్కడ భర్తకు తీర్పు అనుకూలంగా రావడంతో భార్య సుప్రీం కోర్టు మెట్లెక్కింది. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా, సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించి తీర్పు వెల్లడించింది.
తీర్పును వెల్లడిస్తూ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య తెచ్చే వరకట్నం ఉమ్మడి ఆస్తి కాదని తెలిపింది. వధువు పుట్టింటి వారు ఇచ్చే ధనం, నగలు, ఆస్తిని భర్త వాడుకోకూడదని తప్పనిసరిగా వాడుకుంటే భార్యకు తిరిగి ఇవ్వాలని తెలిపింది. బంగారాన్ని వాడుకుని తిరిగి ఇవ్వకపోవడంతో భర్త తన భార్యకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని పేర్కొంది.