పాకిస్థాన్ బిచ్చమెత్తుకుంటోంది: అసదుద్దీన్ ఓవైసీ

ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్‌కి లోన్ రావడంపై అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ని అధికారిక బిచ్చగాడు అని, ఐఎంఎఫ్‌ని అంతర్జాతీయ ఉగ్రవాద నిధి అని ఎద్దేవా చేశారు.

Google News Follow Us

ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే, ఈలోగా పాకిస్తాన్‌కి ఐఎంఎఫ్ నుంచి 1 బిలియన్ డాలర్ల లోన్ మంజూరవడంపై ఇండియా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది.

ఐఎంఎఫ్ లోన్‌పై ఓవైసీ ఫైర్

ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, పాకిస్తాన్‌కి ఐఎంఎఫ్ లోన్ ఇవ్వడంపై ఘాటుగా స్పందించారు. పాకిస్తాన్‌ని అధికారిక బిచ్చగాడు అని అన్నారు. "ఇప్పుడు వాళ్ళు లోకం ముందు బిచ్చమెత్తుకుంటున్నారు. పాకిస్తాన్ ఐఎంఎఫ్ నుంచి 1 బిలియన్ డాలర్లు లోన్ తీసుకుంది" అని అన్నారు.

ఓవైసీ సెటైర్లు

ఓవైసీ ఎద్దేవా చేస్తూ, "ఐఎంఎఫ్ ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్యనిధి కాదు, పాకిస్తాన్‌కి అంతర్జాతీయ ఉగ్రవాద నిధి అయిపోయింది" అని అన్నారు. అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి దేశాలు దీనికి ఎలా ఒప్పుకున్నాయో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. "పాకిస్తాన్‌కి నాయకత్వం సంగతి దేవుడెరుగు, వాళ్ళకి ఆర్థిక వ్యవస్థని సరిగ్గా చూసుకోవడం కూడా రావడం లేదు" అని అన్నారు.

“పాకిస్తాన్‌కి ఆర్థిక వ్యవస్థ చూసుకోవడం కూడా రాదు”

ఓవైసీ ఎద్దేవా చేస్తూ, "ఐఎంఎఫ్ ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్యనిధి కాదు, పాకిస్తాన్‌కి అంతర్జాతీయ ఉగ్రవాద నిధి అయిపోయింది" అని అన్నారు. అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి దేశాలు దీనికి ఎలా ఒప్పుకున్నాయో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. "పాకిస్తాన్‌కి నాయకత్వం సంగతి దేవుడెరుగు, వాళ్ళకి ఆర్థిక వ్యవస్థని సరిగ్గా చూసుకోవడం కూడా రావడం లేదు" అని అన్నారు.

Read more Articles on