శబరిమల వివాదంలో ట్విస్ట్: ఆ ఇద్దరు మహిళలు మాలలో లేరు, వీడియో విడుదల

By sivanagaprasad kodatiFirst Published Jan 4, 2019, 10:20 AM IST
Highlights

సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రెండు రోజుల క్రితం తెల్లవారుజామున శబరిమల అయ్యప్ప దర్శనం చేసుకున్న ఇద్దరు మహిళల వ్యవహారం అనుహ్యా మలుపు తిరిగింది

సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రెండు రోజుల క్రితం తెల్లవారుజామున శబరిమల అయ్యప్ప దర్శనం చేసుకున్న ఇద్దరు మహిళల వ్యవహారం అనుహ్యా మలుపు తిరిగింది. స్వామిని దర్శించుకున్న ఇద్దరు మహిళలు బిందు, కనకదుర్గలు అసలు మాల ధరించలేదని... ఆలయంలోకి ప్రవేశించడానికి కొన్ని గంటల ముందు వరకు వారు సివిల్ డ్రస్సుల్లోనే ఉన్నారని వ్యాఖ్యానించిన శబరిమల పరిరక్షణ సమితి.. ఈ మేరకు వీడియోలు విడుదల చేసింది.

డిసెంబర్ 31వ తేదీన వారిద్దరూ బస చేసిన హోటల్‌లో మామూలు బట్టలు ధరించి తిరుగుతున్న వీడియో చక్కర్లు కొడుతుండటంతో కేరళలో కలకలం రేగింది. ఇప్పటికే వీరు దర్శనం చేసుకున్న వ్యవహారం దక్షిణాదిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.

వీరిద్దరూ మాలలో ఉన్నట్లు నటించి స్వామి సన్నిధికి వచ్చారని, కనీసం విభూది కానీ, కుంకమ కానీ ధరించలేదని శబరిమల పరిరక్షణ సమితి ప్రతినిధులు మండిపడ్డారు. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే వీరిద్దరూ అయ్యప్ప ఆలయ ప్రవేశం చేశారని ఆరోపించారు. 

శబరిమలలోకి మహిళల ఆలయ ప్రవేశం.. సగం మీసంతో ఆందోళన

శబరిమల వివాదం.. ప్రధాన అర్చకుడికి చుక్కెదురు

శబరిమలలో మహిళల ప్రవేశం: అట్టుడుకుతున్న కేరళ

మళ్లీ తెరుచుకున్న శబరిమల ఆలయం

శబరిమలలోకి మహిళలు.. ఆలయం మూసివేత

శబరిమలలో అయ్యప్పను దర్శించుకున్న మరో మహిళ.. ఉద్రిక్తత

click me!