వాయు కాలుష్యానికి ఆత్మహత్యలకు లింకున్నట్టుగా తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
న్యూఢిల్లీ: వాయు కాలుష్యం ఆత్మహత్యలకు దోహదం చేస్తుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. చైనాలో వాయు కాలుష్యం తగ్గించేందుకు ఐదేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వాయు కాలుష్యం తగ్గడం ద్వారా 46 వేల ఆత్మహత్యలు నిరోధించినట్టుగా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. చైనాలో వాయు కాలుష్యంపై శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు నిర్వహించింది. వాయు కాలుష్యంతో ఆత్మహత్యలపై ప్రభావం అనే అంశంపై పరిశోధనలు చేశారు.
also read:టీడీపీ-జనసేన-బీజేపీ నేతల భేటీ: సీట్ల సర్ధుబాటుపై చర్చలు
undefined
చైనా తరహలోనే ఇండియాలో కూడ పలు నగరాల్లో వాయు కాలుష్యం తీవ్రంగానే ఉంది. వాయు కాలుష్యం తగ్గితే ఆత్మహత్యలు కూడ తగ్గుతున్నట్టుగా నివేదికలు తెలుతుపుతున్నాయి.2013లో వాయు కాలుష్య నివారణపై చైనా కేంద్రీకరించింది. పారిశ్రామిక కాలుష్యం, వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు చైనా పలు చర్యలు చేపట్టింది. సహజ ఇంధనాలపై చైనా దృష్టి కేంద్రీకరించింది.
also read:అరుదైన గౌరవం:స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో హైద్రాబాద్ మెట్రో రైలు విజయగాధ
చైనాలో 2010లో ఏడాదికి లక్ష మంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. అయితే 2021 నాటికి ఆత్మహత్యలు 10.88 నుండి 5.25 శాతానికి తగ్గినట్టుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి.పీఎం 2.5 మెదడు కెమిస్ట్రీ, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయనుంది. ఇది ఆత్మహత్య ఆలోచనలకు దారి తీసే అవకాశం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
also read:పీఆర్‌సీ సహా సమస్యలను పరిష్కరిస్తా: ఉద్యోగుల సమావేశంలో రేవంత్ రెడ్డి
చైనాలో ఆత్మహత్యలు తగ్గడానికి గాలి నాణ్యత పెరగడమే కారణమని పరిశోధకులు తేల్చి చెప్పారు.2013 నుండి 2017 మధ్య గాలి నాణ్యత పెరిగిన కారణంగా 46 వేల ఆత్మహత్యలను నిరోధించినట్టుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి
also read:రోబో ద్వారా భోజనం సరఫరా: సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో కూడ వాయు కాలుష్యం తీవ్రంగా వేధిస్తుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వాహనాలను సరి బేసి పద్దతులను కూడ ఆ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పలుమార్లు చేపట్టిన విషయం తెలిసిందే.
ఇండియాలో కూడ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఎన్‌సీఆర్‌బీ, లాన్సెట్ అధ్యయన డేటా మేరకు 2021లో దేశంలో అత్యధిక ఆత్మహత్యలు నమోదయ్యాయి.దేశంలోని పలు ప్రాంతాల్లో నివసించే ప్రజల ఆరోగ్యంపై వాయు కాలుష్యంపై ప్రభావాన్ని లాన్సెట్ స్టడీ రిపోర్టు వెల్లడిస్తుంది.