కాంగ్రెస్ వల్లే మోదీ మరింత శక్తివంతం అవుతున్నారు.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మమతా బెనర్జీ

By team teluguFirst Published Oct 30, 2021, 1:57 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee).. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వల్లే బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మరింత శక్తివంతం అవుతున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee).. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వల్లే బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మరింత శక్తివంతం అవుతున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కారణంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను సీరియస్‌గా తీసుకోకపోవడమేనని అన్నారు. ప్రస్తుతం మమతా బెనర్జీ మూడు రోజుల పర్యటన నిమిత్తం గోవాలో ఉన్నారు. తన పర్యటనలో చివరి రోజైన శనివారం ఆమె పనాజీలో మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయాలు తీసుకోకపోతుందని మండిపడ్డారు.

‘కాంగ్రెస్ పార్టీ (Congress Party) నిర్ణయాలు తీసుకోలేకపోయింది. ఇప్పుడే నేను అన్నీ చెప్పలేను. కానీ కాంగ్రెస్ మాత్రం రాజకీయాలను సీరియస్‌గా తీసుకోలేదు. కాంగ్రెస్ వల్ల మోదీ జీ మరింత శక్తివంతం అవుతున్నారు. ఒకరు నిర్ణయం తీసుకోకపోవడం వల్లే దేశం ఎందుకు బాధపడాలి..?’ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

Also read: సీఎం అవ్వడం కోసం రాలేదు.. కేంద్రం దాదాగిరిని అనుమతించం.. గోవాలో మమతా బెనర్జీ

కాంగ్రెస్ పార్టీకి గతంలో అవకాశం వచ్చిందని మమతా బెనర్జీ అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాల్సింది బదులు.. బెంగాల్ రాష్ట్రంలో తన పార్టీపై పోటీ చేశారని మమతా చెప్పుకొచ్చారు. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నారు..? అని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ఆమె సమాధానం చెప్పడానికి నిరాకరించారు. ‘నేను కాంగ్రెస్ గురించి మాట్లాడం లేదు. ఎందుకంటే అది నా పార్టీ కాదు. నేను నా ప్రాంతీయ పార్టీని స్థాపించాను. ఎవరి మద్దతు లేకుండా మేము మూడు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం’అని మమతా బెనర్జీ అన్నారు.  

Also read: మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీనే.. యూపీ సీఎం అభ్యర్థి ఆయనే.. : కేంద్ర హోం మంత్రి

తాను ఏ రాజకీయ పార్టీ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోనని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. తన పార్టీ గురించి మాత్రమే తాను చెప్పగలనని అన్నారు. బీజేపీపై తమ పోరాటం కొనసాగుతుందని.. ఎవరికి తలవంచబోము అని ఆమె తెలిపారు. తాను ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండాలని కోరుకుంటాను.. అదే విధంగా సమాఖ్య నిర్మాణం పటిష్టంగా కోరుకుంటానని అని చెప్పారు. రాష్ట్రాలను బలంగా తీర్చిదిద్దాలని.. అప్పుడే కేంద్రం బలంగా ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. ఢిల్లీ బెదిరింపులు చాలు అంటూ బీజేపీపై మండిపడ్డారు.   

అంతకుముందు మమతా బెనర్జీ శనివారం తెల్లవారుజామున గోవా ఫార్వర్డ్ పార్టీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్‌తో సమావేశమయ్యారు. దీని గురించి మమతా బెనర్జీ స్పందిస్తూ.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు కలిసి ముందుకు వెళ్లాలని తాను విజయ్ సర్దేశాయ్‌తో చర్చించినట్టుగా తెలిపారు. తాము ఓట్ల విభనను నివారించుకోవాలనుకుంటున్నామని తెలిపారు. బీజీపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు తమతో కలిసి వచ్చే పార్టీలతో ముందుకు సాగుతామని అన్నారు. 

ఇక, గోవా పర్యటనలో ఉన్న మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చేపలు, ఫుట్‌బాల్ అనేవి బెంగాల్, గోవాలను (Goa) కలిపే రెండు అంశాల అని పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్రాలలో కేంద్రం దాదాగిరి చేయడాన్ని తాను అనుమతించబోనని అన్నారు. తాను అధికారం కోసం గానీ, గోవా ముఖ్యమంత్రి కావడానికి గానీ ఇక్కడకు రాలేదని స్పష్టం చేశారు. గోవా కూడా తన మాతృభూమేనని అన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న గోవాలో మమతా బెనర్జీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఎన్నికల్లో టీఎంసీ అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను నిలిపే అవకాశం ఉంది.

click me!