
చెన్నై : లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో మహిళ డాక్టర్ సహా ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన బుధవారం రాత్రి మెచ్చేరిలో చోటుచేసుకుంది. సేలం జిల్లా మెచ్చేరి సమీపంలోని ఉడయనూర్‌కు చెందిన ఎం.దేవనాథన్ (53) ప్రైవేట్ సంస్థ మేనేజర్. ఈయన భార్య ఇంద్రాణి (51) వనవాసి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గా పని చేస్తున్నారు.
గురువారం రాత్రి కోవై నుంచి కారులో మేట్టూర్ కు వస్తున్నారు. వీరితో పాటు దేవనాథన్‌తో పనిచేస్తున్న ఉద్యోగి ఆర్.సత్యశీలన్ (24) కూడా ఉన్నారు. 10:30 గంటలకు భవాని–మేట్టూర్ సాలై మార్గంలోని కాట్టప్పనల్లూర్ మలుపు వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో accident జరిగింది.
ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. భవాని పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కారులో చిక్కుకున్న మృతదేహాలను అతికష్టంపై బయటకు తీసుకువచ్చారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
జమ్ము కశ్మీర్‌లో....
జమ్ము కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం దోడా జిల్లాలో ఓ మినీ బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. చినాబ్ నది తీరాన తలకిందులుగా పడింది. ఈ ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందారు. కనీసం 14 మంది గాయపడ్డట్టు సమాచారం.
ఇందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు స్పాట్‌కు చేరుకున్నారు. బస్సులో నుంచి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చే పనిలో నిమగ్నమయ్యారు. army కూడా సహాయక చర్యలు చేపడుతున్నది. గాయపడినవారిని దోడాలోని హాస్పిటల్‌కు తరలిస్తున్నారు.
తాట్రి నుంచి దోడాకు వెళ్తున్న ఓ mini bus గురువారం రోజు ఉదయం లోయలో పడింది. సుయి గ్వారీ సమీపంలో చినాబ్ నదీ తీరంలో Valleyలోకి బస్సు దూసుకెళ్లింది. లోయ అడుగులో ఆ బస్సు బోల్తా పడి ఉన్నది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేవు.
గుంటూరులో ఘోరం... అతివేగంతో కార్లపైకి దూసుకెళ్లిన లారీ, తృటిలో తప్పిన ప్రాణనష్టం (వీడియో)
ఈ ఘటనపై ప్రధానమంత్రి Narendra Modi, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు స్పందించారు. జమ్ము కశ్మీర్ దోడాలో జరిగిన రోడ్డు ప్రమాదంతో కలత చెందారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో బాధాతప్తులైన కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.
గాయపడినవారు వేగంగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు వివరించారు. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని, క్షతగాత్రులకు రూ. 50వేలు అందిస్తామని ప్రకటించారు.
మృతుల కుటుంబాలకు తన సానుభూతిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ఘటన విషాదాన్ని నింపిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదం గురించి జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడినట్టు తెలిపారు. క్షతగాత్రులకు అవసరమైన చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. వారు వేగంగా కోలుకోవాలని దేవుడిని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.
దోడాలో చోటుచేసుకున్న ప్రమాద స్థలికి చేరుకున్నామని, సహాయక చర్యలు చేపడుతున్నామని దోడా అదనపు ఎస్పీ వివరించారు. ఘటనా వివరాలు తెలుసుకున్నామని, కావాల్సిన సహకారాలు అందిస్తామని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.