డ్రగ్స్ కేసు: షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను కోర్టులో హాజరుపరిచిన ఎన్సీబీ

By Siva KodatiFirst Published Oct 3, 2021, 4:31 PM IST
Highlights

ముంబై సముద్ర తీరంలోని క్రూయిజ్‌లో డ్రగ్స్ సేవిస్తూ అరెస్ట్ అయిన బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ కోర్టు ఎదుట హాజరుపరిచింది. డ్రగ్స్ కేసులో మొత్తం ఎనిమిది మందిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. 

ముంబై సముద్ర తీరంలోని క్రూయిజ్‌లో డ్రగ్స్ సేవిస్తూ అరెస్ట్ అయిన బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ కోర్టు ఎదుట హాజరుపరిచింది. డ్రగ్స్ కేసులో మొత్తం ఎనిమిది మందిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. ఆర్యన్ ఫోన్‌లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. దీంతో అతని ఫోన్‌ను ఎన్‌సీబీ సీజ్ చేసింది. అలాగే ముంబైలోని 5 ప్రాంతాల్లో ఎన్‌సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆర్యన్‌ను  పలు కోణాల్లో ప్రశ్నించారు అధికారులు. 

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు శనివారం రాత్రి ఓ క్రూయిజ్ షిప్‌లను డ్రగ్స్ కనుగొన్నారు. ఈ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఉన్నట్టు తెలిసింది. ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేయలేదని, ఆయనపై అభియోగాలు మోపలేదని అధికారులు తెలిపారు. అయితే, ఈ కేసులో ప్రశ్నించడానికి ఆర్యన్ ఖాన్‌ సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఈ పార్టీ ఎఫ్‌టీవీ ఇండియా ఎండీ ఖషీఫ్ ఖాన్ పర్యవేక్షణలో జరిగినట్టు సమాచారం. 

ఈ కేసులో కొకెయిన్, మెఫెడ్రోన్, ఎక్స్‌స్టాసీ సహా పలురకాల మాదకద్రవ్యాలను అధికారులు సీజ్ చేశారు. ఆర్యన్ ఖాన్ సహా మున్‌మున్ దమేచా, నుపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మొహక్ జస్వాల్, విక్రాంత్ ఛొకర్, గోమిత్ చోప్రా, అర్బాజ్ మెర్చంట్‌లనూ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారంపై వీరిని ప్రశ్నించనున్నారు. ఇందులో భాగంగా ఆర్యన్ ఖాన్ ఫోన్‌నూ అధికారులు సీజ్ చేసినట్టు తెలిసింది.

ముంబయి నుంచి గోవాకు వెళ్లాల్సిన క్రూయిజ్ షిప్ శనివారం రాత్రి బయల్దేరింది. ఈ షిప్ మూడు రోజుల ‘మ్యూజికల్ వోయేజ్’లో భాగంగా ముంబయి నుంచి గోవాకు వెళ్లాల్సి ఉన్నది. అయితే, ఈ షిప్‌లో రేవ్ పార్టీ నిర్వహించనున్నట్టు, అందులో డ్రగ్స్ కూడా తీసుకునే అవకాశముందని అధికారులకు 15 రోజుల కిందే సమాచారం అందింది. ఈ షిప్‌లో ఢిల్లీ నుంచి ఓ బిజినెస్ మ్యాన్ కూతురు, మరో యువతి కూడా ఎక్కినట్టు తెలిసింది. వీరితోపాటు ఆర్యన్ ఖాన్ కూడా షిప్‌లో ఉన్నారు. ముంబయి నుంచి క్రూయిజ్ షిప్ బయల్దేరి సముద్రంలోకి ఎంటర్ అయ్యాక ప్రయాణికులు కొందరు బ్యాగుల్లో నుంచి డ్రగ్స్ తీసుకున్నారని సమాచారం.

ఈ క్రూయిజ్ షిప్ వ్యవహారంపై ముందస్తుగానే సమాచారం ఉన్న ఎన్‌సీబీ అధికారులు ప్యాసింజర్ రూపంగానే టికెట్లు తీసుకుని షిప్‌లోకి ఎంటర్ అయ్యారు. షిప్ సముద్రంలోకి వెళ్లాక డ్రగ్స్ తీసుకోగానే అధికారులు యాక్షన్‌లోకి దిగారు. డ్రగ్స్ తీసుకుంటున్నట్టు అనుమానాలున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. షిప్ కెప్టెన్ దగ్గరకు వెళ్లారు. వెంటనే షిప్ వెనక్కి తీసుకెళ్లాలని ఆదేశించారు.

click me!