భరణం అడిగిందని.. భార్య ముక్కు కొరికేశాడు.. !

By AN TeluguFirst Published Sep 27, 2021, 2:24 PM IST
Highlights

కుటుంబ వివాదాల కారణంగా భర్త కోపంతో భార్య ముక్కు కొరికినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

మధ్యప్రదేశ్ : తాళి కట్టిన భార్యపై భర్త అమానుషంగా ప్రవర్తించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో (domestic dispute) క్షణికావేశంలో ఆమె ముక్కును(nose) తీవ్రంగా కొరికాడు(bite). దీంతో విలవిలలాడుతున్న ఆ మహిళను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్ (Madya pradesh)లోని రత్లం జిల్లా అలోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 

కుటుంబాల్లో కలహాలు మామూలే. భార్యభర్తల మధ్య గొడవలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కాకపోతే అవి శృతి మించితేనే ప్రమాదంగా మారతాయి. కొన్నిసార్లు ఇవి హింసకు దారితీసి ఎవర్నో ఒకర్ని నేరస్తులుగానూ మార్చేస్తాయి. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. 

కుటుంబ వివాదాల కారణంగా భర్త కోపంతో భార్య ముక్కు కొరికినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆలోట్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ నీరజ్ సర్వన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉజ్జయినికి చెందిన దినేష్, టీనా దంపతలకు 2008లో వివాహం జరిగింది. 

ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. భర్తకు ఉద్యోగం లేకపోవడంతో మద్యం తాగుతూ తనను ఇబ్బందులకు గురిచేసేవాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. వివాహం అనంతరం కొన్నేళ్లకు భర్త వేదింపులు తట్టుకోలేక టీనా తన కుమార్తెలతో కలిసి పుట్టింటికి వెళ్లి ఉంటోంది. అక్కడే పనిచేసుకుంటూ పిల్లలను చూసుకుంటుంది. ఈ క్రమంలో 2019లో ఆమె తన భర్త నుంచి భరణం కావాలని కోర్టులో కేసు వేసింది. 

ప్రధాని నరేంద్ర మోడీ ఆకస్మిక తనిఖీ.. నూతన పార్లమెంటు నిర్మాణ పనుల పరిశీలన.. వీడియో ఇదే

ఈ క్రమంలో దినేష్.. ఇటీవల టీనా ఇంటికెళ్లి దీనిమీద ఆమె తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ తరుణంలో కోపంతో ఉన్న దినేష్ తన కుమార్తెల ఎదుటే టీనా మీద దాడి చేశారు. పళ్లతో ఆమె ముక్కును కొరికాడు. దీంతో ముక్కు మీద గాయాలై తీవ్ర రక్తస్రావం అయ్యింది. 

ఆ తరువాత దినేష్ అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోందని, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని అలోట్ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జ్ నీరజ్ సర్వన్ తెలిపారు. 

click me!