మహిళ రేప్ చేసినట్టు మైనర్ బాలిక ఫిర్యాదు.. ఖంగుతిన్న పోలీసులు.. అసలేం జరిగిందంటే?

By Mahesh KFirst Published Dec 17, 2022, 8:42 PM IST
Highlights

రాజస్తాన్‌లో ఓ మైనర్ బాలిక కిడ్నాప్, రేప్ ఫిర్యాదుతో పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్ాయదు మేరకు నిందితుడు శంకర్‌ను అరెస్టు చేశారు. కానీ, నిందితుడు పురుషుడు కాదని, మహిళ అని మెడికల్ పరీక్ష ధ్రువీకరించింది. దీంతో ఆ బాలిక రేప్ ఆరోపణలు అవాస్తవమని అంగీకరించింది.
 

జైపూర్: రాజస్తాన్‌లోని సిరోహి జిల్లాలో పోలీసులకు ఓ మైనర్ బాలిక అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేసింది. ఆ బాలిక ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ బాలిక చెప్పిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కానీ, అసలు ట్విస్ట్ అప్పుడే బయటపడింది. ఆ నిందితుడు పురుషుడి వేషంలో కనిపించే మహిళ. కావాలంటే మెడికల్ టెస్టు చేసుకోండని చెప్పగా.. ఆ రిపోర్టు ఆమె మహిళనే అని కన్ఫమ్ చేసింది.

ఆ మహిళ, ఆమె భర్త విడిగా ఉంటున్నారు. ఆమె బతకడానికి సొంతంగా కష్టపడాల్సి వస్తున్నది. అందుకోసమే ఆమె పురుషుడి వేషం వేసుకుంది. డబ్బు సంపాదించుకోవడం, ఇతర అవసరాల కోసం ఆమె పురుషుడి వేషంలో ఉన్నది.

ఇక కేసు విషయానికి వస్తే.. ఓ మైనర్ బాలిక తమను ఆశ్రయించి తనను కిడ్నాప్ చేసి రెండు రోజులపాటు రేప్ చేసినట్టు తెలిపిందని మహిళా పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో మాయా పండిత్ తెలిపారు. నవంబర్ 28వ తేదీన తమకు ఫిర్యాదు ఇచ్చిందని వివరించారు. రేప్ తర్వాత నిందితుడు తనను ఆటోలో ఇంటికి పంపినట్టు బాలిక పేర్కొంది.

Also Read: ఒక్క రాత్రి ప్రియుడితో గడిపి.. ఉదయం అతని ఏడేళ్ల కొడుకుతో జంప్..

డిసెంబర్ 5వ తేదీన బాలిక ఆరోపణలు చేసిన శంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలిక ఇచ్చిన ఫొటో ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

అరెస్టు చేసిన తర్వాత తాను పురుషుడిని కాదని, పురుషుడి వేషంలో శంకర్‌గా చెలామణి అవుతున్న మహిళను అని పేర్కొన్నట్టు ఎస్‌హెచ్‌వో మాయా పండిత్ వివరించారు. మెడికల్ ఎగ్జామినేషన్‌లో ఆమె చెప్పిన మాట నిజమే అని నిర్ధారణ అయిందని తెలిపారు. దీంతో మైనర్ బాలిక చేసిన అత్యాచార ఆరోపణలు అబద్ధాలని తేలిపోయాయి. ఆ మైనర్ బాలిక కూడా రేప్ ఆరోపణ అబద్ధమే అని అంగీకరించింది.

దీంతో ఆ మహిళపై రేప్ కేసు కాకుండా.. బాలికను కిడ్నాప్ చేసినందుకు కేసు నమోదైంది. అందుకే ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నదని ఎస్‌హెచ్‌వో వివరించారు. ఆ మైనర్ బాలికను కిడ్నాప్ చేయడానికి గల కారణం మాత్రం వెంటనే తెలియరాలేదు.

click me!