ఇవాళ్టి టాప్ టెన్ వార్తలు..
కవితకు ఈడీ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ కోర్టు ఊరటను ఇవ్వలేదు. ఈడీ కస్టడీ మరో మూడు రోజుల పాటు కోర్టు పొడిగించింది. పూర్తి కథనం..
భువనగిరి ఎంపీ స్థానం: పోటీపై కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ విషయమై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వం ఆదేశిస్తే పోటీ చేయడంపై ఆలోచిస్తామని తెలిపారు. పూర్తి కథనం..
సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్..
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ మరో అభ్యర్థిని ప్రకటించింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పేరును పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది. పూర్తి కథనం..
పట్టాలపై నిలిచిన రైలు: తోసిన రైల్వే ఉద్యోగులు, వీడియో వైరల్
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆమెథీలో రైల్వే ఉద్యోగులు రైలును తోసుకుంటున్న వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి కథనం..
తీహార్ జైలుకు స్వాగతం - కేజ్రీవాల్ కు సుఖేష్ చంద్రశేఖర్ సందేశం..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ సందేశం పంపించారు. తీహార్ జైలుకు స్వాగతం అని అందులో పేర్కొన్నారు. తాను అప్రూవల్ గా మారుతానని చెప్పారు. పూర్తి కథనం..
రష్యాలో దుండగుల కాల్పులు: 40 మంది మృతి, 145 మందికి గాయాలు
మాస్కోలో దుండగులు జరిపిన కాల్పుల్లో 40 మంది మృతి చెందారు. ఈ ఘటనను ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు. పూర్తి కథనం..
పృథ్వీ షాకు షాకిచ్చిన ఢిల్లీ.. షాయ్ హోప్ అరంగేట్రం.. నెటిజన్లు షాక్.. !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) లో భాగంగా పంజాబ్ కింగ్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రెండో మ్యాచ్ జరిగింది. పంజాబ్ బౌలర్లు రాణించడంతో ఢిల్లీ టీమ్ భారీ స్కోర్ చేయలేకపోయింది. పూర్తి కథనం..
హోం గ్రౌండ్‌లో తిరుగులేని సీఎస్కే.. ఆర్సీబీని దెబ్బకొట్టిన ముస్తాఫిజుర్
RCB vs CSK: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో ఐపీఎల్ 2024 లో చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగ్గా, సీఎస్కే 6 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తుచేసింది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ బెంగళూరు పతనాన్ని శాసించాడు. పూర్తి కథనం..
రాజకీయాల్లోకి చిరుత హీరోయిన్ నేహా శర్మ
దేశం మొత్తం లోక్ సభ ఎన్నికల వేడి కనిపిస్తోంది. చాలా మంది సినీతారలు, క్రీడాకారులు లోక్ సభ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకోనున్నారు. తాజాగా మరో క్రేజీ హీరోయిన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి కథనం..
చిరంజీవి, ప్రభాస్, అల్లు అర్జున్.. స్టార్స్ పై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు
‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) తాజాగా టాలీవుడ్ స్టార్స్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ పై ఇలా మాట్లాడారు. పూర్తి కథనం..