March 16-Top Ten News: టాప్ టెన్ వార్తలు

By Sairam Indur  |  First Published Mar 16, 2024, 7:21 PM IST

ఈ రోజు టాప్ టెన్ వార్తలు..


సార్వత్రిక ఎన్నికలకు మోగిన నగారా..

సార్వత్రి ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తంగా ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించన్నారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి అవుతాయి. పూర్తి కథనం..

Latest Videos

బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా..

బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. బరువెక్కిన హృదయంతో బహుజన్ సమాజ్ వాదీ పార్టీని వీడుతున్నానని ప్రకటించారు. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేనని వెల్లడించారు. పూర్తి కథనం..

ఎమ్మెల్సీ కవితకు 23వ తేదీ వరకు రిమాండ్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్టు అయిన బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టు రిమాండ్ విధించింది. ఆమెను వారం రోజుల పాటు ఈడీ అధికారుల కస్టడీకి అప్పగించింది. పూర్తి కథనం..

ఉరుములు, మెరుపులతో వ‌ర్షాలు..

తెలంగాణలోని ప‌లు జిల్లాల్లో మేఘావృత‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) హైద‌రాబాద్ తెలిపింది. ప‌లు చోట్ల వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది. పూర్తి కథనం..

నాగర్​కర్నూల్ లో మోడీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం..

లోక్‌సభ ఎన్నికలు 2024 నేప‌థ్యంలో ప్రధాని న‌రేంద్ర మోడీ  నేడు తెలంగాణ పర్యటించారు. బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బ‌య‌లుదేరి నాగర్ కర్నూల్ లో బ‌హిరంగ స‌భ‌కు విచ్చేశారు. పూర్తి కథనం..

వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల..
రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల బరిలో నిలిపే అభ్య‌ర్థుల జాబితాను వైఎస్ఆర్సీపీ విడుద‌ల చేసింది. మొత్తం 200 సీట్ల‌ల‌లో స్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేస్తూ 100 సీట్లు కేటాయించారు. పూర్తి కథనం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 పూర్తి షెడ్యూల్ ఇదే.. 

ఆంధ్ర ప్రదేశ్ లోని 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ సీట్లకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్, మే 13న పోలింగ్  జరపనున్నట్లు ఈసి ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్ గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. పూర్తి కథనం..

ప్రభాస్‌ సినిమాపై ఎన్నికల దెబ్బ..

ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి2898ఏడీ` సినిమాకి ఎన్నికల సంఘం పెద్ద షాకిచ్చింది. దీంతో ఇప్పుడు ఈ మూవీ వాయిదా పడబోతుందని తెలుస్తుంది. పూర్తి కథనం..

పుతిన్ తల్లిదండ్రుల సమాధిపై మూత్ర విస‌ర్జ‌న..

ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తల్లిదండ్రుల సమాధుల‌కు సంబంధించిన ఒక వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ర‌ష్యా ఎన్నిక‌ల మ‌ధ్య ఈ వీడియో వెలుగులోకి రావడం క‌ల‌క‌లం రేపుతోంది. పూర్తి కథనం..

ఫైన‌ల్స్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..

మహిళల ప్రీమియర్ లీగ్ 2024లో ఎలిమినేట‌ర్ రౌండ్ లో ముంబై ఇండియ‌న్స్ పై రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో డ‌బ్ల్యూపీఎల్ 2024లో లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. పూర్తి కథనం..

click me!