ఈ రోజు టాప్ టెన్ వార్తలు
టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ తన అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో 34 మంది అభ్యర్థులు ఉన్నారు. పూర్తి కథనం
ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకం
ప్రధాన మోడీ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించింది. కేరళకు చెందిన జ్ఞానేశ్వర్ కుమార్, పంజాబ్‌కు చెందిన సుఖ్‌బిర్ సింగ్ సంధులను నియమించింది. పూర్తి కథనం
బీజేపీకి జితేందర్ రెడ్డి షాక్ ఇస్తారా?
బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిలు వెళ్లారు. మహబూబ్ నగర్ పార్లమెంటు టికెట్ దక్కని జితేందర్ రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. పూర్తి కథనం
పవన్ కళ్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ పోటీ
పవన్ కళ్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ పోటీ చేస్తానంటూ ప్రకటన చేశారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ఆర్జీవీ ట్వీట్ చేశారు. పూర్తి కథనం
వాహనాల రిజిస్ట్రేషన్ టీఎస్ నుండి టీజీకి మార్పు
రేవంత్ రెడ్డి సర్కార్ అభ్యర్థన మేరకు తెలంగాణలో వాహనాల నెంబర్ల ప్లేట్ల రిజిస్ట్రేషన్ ఇక నుండి మారనున్నాయి. పూర్తి కథనం
సీఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుకోం
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అణచివేతకు గురైన మైనారిటీలకు హక్కులు, న్యాయం అందించడమే తమ లక్ష్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. సీఏఏను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోబోమని చెప్పారు. పూర్తి కథనం
రాష్ట్రపతి వద్దకు‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’నివేదిక
దేశంలో ఒకే సారి ఎన్నికలు నిర్వహించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు అయిన కమిటీ తన నివేదికను సమర్పించింది. 18 వేలకు పైగా పేజీలు ఉన్న ఈ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందించింది. పూర్తి కథనం
పూరీ జగన్నాథ్ సొంత తమ్ముడు ఇప్పుడు ఎమ్మెల్యే
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి మరో సొంత తమ్ముడు ఉన్నాడని, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అనే విషయం చాలా మందికి తెలియదు. పూర్తి కథనం
చిరంజీవితో ఉన్న గొడవేంటో బయటపెట్టిన నటి సుహాసిని
మెగాస్టార్ చిరంజీవి, సుహాసిని కలిసి చాలా సినిమాలు చేశారు. అయితే వీరి మధ్య స్నేహం, అనుబంధం గొడవతో ప్రారంభమైందట. మరి ఆ గొడవేంటో తాజాగా సుహాసిని బయటపెట్టింది.
రంజీ ట్రోఫీ 2024 విజేతగా ముంబై
ముంబై రంజీ ట్రోఫీని రికార్డు స్థాయిలో 42వ సారి గెలుచుకుంది. రంజీ ట్రోఫీ 2024 ఫైనల్లో ముంబై 169 పరుగుల తేడాతో విదర్భను ఓడించింది. 8 ఏళ్ల తర్వాత ముంబై ఈ టైటిల్‌ను గెలుచుకుంది. పూర్తి కథనం