సోషల్ మీడియాలో ఓ యూజర్ పోస్ట్ చేసిన వీడియోను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఆ వీడియో చాలా గొప్పగా ఉందని అన్నారు. ఆ యువకుడిని అభినందించారు.
నమో భారత్ రైలు ఈస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్ ప్రెస్ వేను దాటుతున్న వీడియోను ఓ యూజర్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యూజర్ ను ప్రశంసించారు. ఈ వీడియో చాలా గొప్పగా ఉందని కొనియాడారు.
రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్ఆర్టీఎస్) కింద 2023 అక్టోబర్ లో ప్రధాని ప్రారంభించిన ఈ ప్రత్యేక హైస్పీడ్ రైలు ప్రస్తుతం సాహిబాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్ లోని దుహై డిపో వరకు 17 కిలోమీటర్ల పొడవున నడుస్తోంది. ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ ప్రెస్ వే హర్యానా, ఉత్తర ప్రదేశ్ ల గుండా వెళుతుంది. ఈ రైలుకు సంబంధించిన వీడియోను మోహిత్ కుమార్ అనే వ్యక్తి ‘ఎక్స్’లో 'డిటాక్స్ ట్రావెలర్' పేరుతో మంగళవారం సాయంత్రం పోస్ట్ చేశారు.
Great video…
Your Timeline gives a good perspective of the new India we are building together. https://t.co/sgiyKXeOrI
కొన్ని గంటల తర్వాత, ప్రధాని ఆ ట్వీట్ ను రీపోస్ట్ చేసి.. ‘‘గ్రేట్ వీడియో - మీ టైమ్ లైన్ మనం కలిసి నిర్మిస్తున్న నవ భారతదేశం గురించి మంచి దృక్పథాన్ని ఇస్తుంది’’ అని పేర్కొన్నారు. ప్రధాని తన పోస్ట్ ను రీపోస్ట్ చేయడంపై మోహిత్ కుమార్ స్పందించారు. ‘‘కంటెంట్ క్రియేటర్లను ప్రశంసించడమే కాకుండా ప్రోత్సహించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.
ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ తో పాటు, రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్) మొదటి దశలో ఢిల్లీ-అల్వార్, ఢిల్లీ-పానిపట్ కారిడార్లు కూడా ఉన్నాయి. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ కు 2019 మార్చి 8న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. జాతీయ రాజధాని ప్రాంతంలో అభివృద్ధి కోసం మొత్తం ఎనిమిది ఆర్ఆర్టీఎస్ కారిడార్లను గుర్తించారు.