సీబీఐ కొత్త డైరెక్టర్‌గా తెలుగు ఐపీఎస్

By sivanagaprasad kodatiFirst Published Oct 24, 2018, 7:51 AM IST
Highlights

భారతదేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్ధ.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది.. ప్రస్తుతం ఆయన సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్నారు.

భారతదేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్ధ.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఇన్‌ఛార్జ్ డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది.. ప్రస్తుతం ఆయన సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్నారు.

సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా మధ్య ఆధిపత్య పోరు మొదలవ్వడంతో పాటు అవినీతి ఆరోపణలతో సీబీఐ ప్రతిష్ట మసకబారుతుండటంతో ప్రధాని రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో అలోక్ వర్మ, రాకేశ్ ఆస్థానాలను సెలవుగా వెళ్లాల్సిందిగా ఆదేశించి.. జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న నాగేశ్వరరావును ఇన్‌ఛార్జ్ డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

సీబీఐలో అంతర్యుద్దం: ఎవరీ సతీష్‌బాబుడీవోపీటీ ఉత్తర్వులతో ఆయన తక్షణం బాధ్యతలు చేపట్టనున్నారు. మన్నెం నాగేశ్వరరావు తెలుగువారు... ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా నర్సాపూర్. 1986 బ్యాచ్‌కి చెందిన నాగేశ్వరరావు ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారి.. గతంలో ఆయన ఒడిషా డీజీపీగానూ పనిచేశారు. విజయరామారావు తర్వాత సీబీఐ డైరెక్టర్‌గా నియమించబడిన రెండో తెలుగు వ్యక్తిగా నాగేశ్వరరావు రికార్డుల్లోకి ఎక్కారు.

సీబీఐ స్పెషల్ డైరెక్టర్ కు ఊరట:అరెస్ట్ చేయెుద్దన్న ఢిల్లీ హైకోర్టు

సతీష్ సానా ఇష్యూ: సిఎం రమేష్ ఇరుక్కున్నారా, టీడీపికి చిక్కులే...

జగన్ కేసు: అప్పటి నుండే సీబీఐ దర్యాప్తులో సతీష్ సానా పేరు

సీబీఐలో అంతర్యుద్దం: ఎవరీ సతీష్‌బాబు

సీబీఐలో కుమ్ములాట: రంగంలోకి దిగిన ప్రధాని మోడీ

సీబీఐ చరిత్రలోనే తొలిసారి.. లంచం కేసులో సొంత డైరెక్టర్‌పైనే ఎఫ్ఐఆర్

 

 

 

click me!