ముఖ్యమంత్రి కాలు మెుక్కిన సీఎం

By Nagaraju TFirst Published Oct 23, 2018, 9:19 PM IST
Highlights

సాధారణ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రి కాలు మెుక్కడం చూశాం. రాజకీయాల్లో ఇవి తరచూ కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మరో రాష్ట్రముఖ్యమంత్రి కాళ్లు మెుక్కడం మాత్రం ఎక్కడా చూసి ఉండం. ఎక్కడో సినిమాల్లో తప్ప. 
 

రాయ్‌పూర్‌: సాధారణ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రి కాలు మెుక్కడం చూశాం. రాజకీయాల్లో ఇవి తరచూ కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మరో రాష్ట్రముఖ్యమంత్రి కాళ్లు మెుక్కడం మాత్రం ఎక్కడా చూసి ఉండం. ఎక్కడో సినిమాల్లో తప్ప. 

కానీ ఇలాంటి అరుదైన ఘటన ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రమణ్‌ సింగ్‌(66) ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాదాలు మెుక్కారు. యోగి ఆదిత్యనాథ్ రమణ్ సింగ్ కంటే దాదాపు 20 ఏళ్లు చిన్నవాడు. అయినా రమణ్ సింగ్ యోగి ఆదిత్య నాథ్ కాళ్లు మెుక్కడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.   

ఇంతకీ ఛత్తీస్ ఘర్ లో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎందుకు వచ్చారనేగా మీ డౌట్. వచ్చే నెలలో ఛత్తీస్ ఘర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలోల​ రమణ్‌ సింగ్‌ రాజ్‌నందన్‌గావ్‌ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్ వేయడానికి వెళ్లే ముందు ఇలా యూపీ సీఎం కాళ్లకు మెుక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. 

నామినేషన్‌ అనంతరం ఇరు రాష్ట్రాల సీఎంలు రాజ్‌నందన్‌గావ్‌ నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే సీనియర్లు ఇలా యోగికి పాదాభివందనం చేస్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడం ఇదే ప్రథమం కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. భారత రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ యోగి ఆదిత్యనాథ్‌ ముందు శిరస్సు వంచి నిల్చుని ఉన్న ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టాయి.

click me!