భార్య నగ్న చిత్రాలు, ఫోన్ నెంబర్ పోర్న్ సైట్లో పెట్టి..!

By telugu news teamFirst Published Jul 2, 2021, 8:59 AM IST
Highlights

జయశంకర్‌ ఒక ప్రైవేటు కంపెనీలో ఇంజీనీర్‌గా పనిచేసేవాడు. మహిళా టెక్కీతో 2019 లో వివాహమైంది. ఇంటి ఖర్చులను ఆమే భరించేది

కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా , ప్రేమగా చూసుకోవాల్సిందిపోయి ఓ భర్త నీచంగా ప్రవర్తించాడు.  భార్య పట్ల తన శాడిజమంతా ప్రదర్శించాడు. భార్య నగ్న చిత్రాలను, ఆమె ఫోన్ నెంబర్ ని పోర్న్ సైట్లో షేర్ చేశాడు. ఆమె ఓ వ్యభిచారి అంటూ.. ఎవరైనా సంప్రదించవచ్చంటూ పేర్కొనడం గమనార్హం. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇందిరానగరకు చెందిన మహిళా టెక్కీ (25) చేసిన ఫిర్యాదు ప్రకారం ఆమె భర్త జయశంకర్‌ కుమార్‌సింగ్‌ (29) ఈ నీచానికి పాల్పడ్డాడు. జయశంకర్‌ ఒక ప్రైవేటు కంపెనీలో ఇంజీనీర్‌గా పనిచేసేవాడు. మహిళా టెక్కీతో 2019 లో వివాహమైంది. ఇంటి ఖర్చులను ఆమే భరించేది. మీ పుట్టింటి వారితో మాట్లాడరాదని ఆమెను కట్టడి చేసేవాడు. తరచూ గొడవ పడి కొట్టడం, వేధించడం, ప్రశ్నిస్తే పొడిచి చంపుతానని బెదిరించడంతో ఆమెకు ప్రాణభయం ఏర్పడింది. దీంతో భర్త నుంచి దూరంగా ఉండాలని ఒక పీజీ హాస్టల్‌లో తలదాచుకుంది.

కానీ సైకో భర్త ఆమెకు అశ్లీల మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ పంపించి వేధించేవాడు. గతంలో హలసూరు పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయగా, ఇకపై బుద్ధిగా ఉంటానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అయితే ఈసారి ఆమె పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్‌ సృష్టించి అందులో ఆమె మొబైల్‌ నెంబరు పెట్టి ఎస్కార్ట్స్‌ సర్వీస్‌ అని అప్‌లోడ్‌ చేశాడు. దీంతో ఆమె ఫోన్‌కు విపరీతంగా కాల్స్, అసభ్య సందేశాలు రావడం మొదలైంది. దీంతో ఆరా తీయగా భర్త పాడుపని గురించి తెలిసింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.  

click me!