Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్ కీలక ప్రకటన చేశారు. లోక్‌సభ ఎన్నికలు ముగిశాక కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే.. ఆరోజు విడుదల అంటూ కీలక ప్రకటన చేశారు.
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్ కౌన్సిలర్లతో ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలిపారు. అధికారంలోకి విపక్ష ఇండియా కూటమి ( ఇండియా బ్లాక్)వస్తే కేజ్రివాల్ తిహాడ్ జైలు నుంచి బయటకు వస్తానని సోమవారం నిర్వహించిన ఓ సమావేశంలో అన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. ఈ ఫలితాల్లో ఇండియా కూటమికి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే జూన్ 5వ తేదీన జైలు నుంచి తాను విడుదలవుతానని తెలిపారు.
డిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కొద్ది రోజుల కిందట డిల్లీ మద్యం కుంభకోణానికి చెందిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన విషయం విదితమే. ఇదిలా ఉంటే లోక్ సభ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా సుప్రీం కేజ్రివాల్ కు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాగా ఆయన జూన్ 2వ తేదీన మళ్లీ లొంగిపోవాల్సింది. ఏడు దశల సార్వత్రిక ఎన్నికలు జూన్ 1న ముగియగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి.
13 మంది అధికారులు తన సెల్ లో ఉన్న రెండు సీసీటీవీ కెమెరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారని తెలిపారు. గతంలో తిహాడ్ జైలు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు ఆయనను అవమానించేందుకు ఎంతగానో ప్రయత్నించారని ఆయన తెలిపారు. దానికి సంబంధించిన వీడియో ఫుటేజీని ప్రధాని కార్యాలయానికి పంపామని తెలిపారు. మోదీకి తనపై అంత కుట్ర ఎందుకో తెలియడం లేదన్నారు. ఆప్ నేతలను ప్రజలు ప్రేమతో చూస్తున్నారని, గౌరవిస్తున్నారని కేజ్రివాల్ తెలిపారు.