దక్షిణాదిలో బీజేపీ జెండా ఎగ‌ర‌డం ప‌క్కా.. అమిత్ షా కామెంట్స్ వైర‌ల్

By Mahesh RajamoniFirst Published May 13, 2024, 10:52 PM IST
Highlights

Amit Shah : దక్షిణాదిలో భారీ విజయం ద‌క్కుతుంద‌నీ, బీజేపీ అధిక స్థానాలు గెలుచుకుంటుంద‌ని కేంద్ర‌ హోం మంత్రి, బీజేపీ సీనియ‌ర్ లీడ‌ర్ అమిత్ షా అన్నారు. మ‌రోసారి కేంద్రంలో ఎన్డీయే స‌ర్కారు అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తంచేశారు.
 

Lok Sabha Elections 2024 - Amit Shah :  ఏన్డీయే కూట‌మి కేంద్రంలో మ‌రోసారి అధికారంలోకి వ‌స్తుంద‌ని బీజేపీ సీనియ‌ర్ లీడ‌ర్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్య‌క్తం చేశారు. దేశ ప్ర‌జ‌లు మ‌రోసారి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వైపు చూస్తున్నార‌నీ, క‌మ‌లం విక‌సిస్తుంద‌ని తెలిపార‌డు. జరుగుతున్న ఎన్నికలలో బీజేపీ ఘ‌న‌మైన పనితీరును పునరుద్ఘాటించిన అమిత్ షా.. దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీ 'భారీ విజయం' కోసం ఎదురుచూస్తోందని పేర్కొన్నారు.

ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక సహా నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయం దిశగా పయనిస్తోందని అన్నారు. ఇక్క‌డ ప్ర‌జ‌లు బీజేపీ స‌ర్కారు చేసిన ప‌నిని తెలుసుకుంద‌నీ, మ‌రోసారి ప్ర‌ధాని మోడీకే ప్ర‌భుత్వ ప‌గ్గాలు అప్ప‌గించాల‌నుకంటున్నార‌ని తెలిపారు. ముఖ్యంగా 'మిషన్ సౌత్' ఈసారి బీజేపీకి కీలకమైన థ్రస్ట్‌లలో ఒకటి, ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్దేశించిన లక్ష్యమైన '400 మార్క్'ని దాటాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.

Latest Videos

దక్షిణాదిలో ఏన్డీయే కూట‌మి భారీ విజ‌యం కోసం చూస్తోంద‌ని తెలిపిన అమిత్ షా ఇక్క‌డి నాలుగు రాష్ట్రాల్లో సాధించబోచే స్థానాల సంఖ్య‌ల‌పై జోస్యం చెప్పారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు కలిసి లోక్‌సభకు 109 స్థానాలను పంపాయి.. వాటిలో 2019 ఎన్నికలలో బీజేపీ 29 గెలుచుకుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో బీజేపీకి ఒక్క‌స్థానం కూడా లేదు. అయితే ఈసారి కేరళలో తన ఖాతా తెరవడంతో పాటు రెండు రాష్ట్రాల్లోనూ అద్భుతమైన ఫ‌లితాల‌ను ఆశిస్తోంద‌ని తెలిపారు. రాజ్యాంగంలో మార్పులు, రిజర్వేషన్లపై ప్రతిపక్షాల ఆరోపణలతో సహా రెండు అంశాలపై కూడా హోం మంత్రి మాట్లాడారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ నకిలీ కథనాలను సృష్టించడం మానుకోవాలనీ, ప్రజాస్వామ్య ప్రక్రియను నిర్వీర్యం చేసేలా ఓటర్లను తప్పుదోవ పట్టించవద్దని  షా కోరారు. "మోడీ రెండుసార్లు ప్రధాని అయ్యారు. రెండు సార్లు ఆయనకు స్పష్టమైన ఆదేశం వచ్చింది. కాబట్టి, బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని లేదా రిజర్వేషన్లను తొలగించాలని కోరుకుంటే, మమ్మల్ని ఎవరు ఆపగలరు? అమిత్ షా అన్నారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశాన్ని తప్పుదోవ పట్టించాలనుకుంటున్నార‌ని కూడా అమిత్ షా ప్ర‌స్తావించారు. ఈ విషయం దేశ ప్రజలకు తెలుసున‌నీ, అతను భ్రాంతితో మాయను వ్యాప్తి చేస్తున్నాడని" అన్నారు. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, రామమందిర నిర్మాణానికి, సర్జికల్ స్ట్రైక్ నిర్వహించడానికి, చంద్రయాన్‌ను ల్యాండ్ చేయడానికి, కోవిడ్ మహమ్మారి సమయంలో బీజేపీ ప్ర‌భుత్వం చేసిన ప‌నిని అమిత్ షా హైలైట్ చేశారు. సామాన్య ప్రజల జీవనాన్ని సులభతరం చేసేలా బీజేపీ స‌ర్కారు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ల పతనంపై అడిగిన ప్రశ్నలకు, మార్కెట్ పతనాన్ని ఎన్నికలతో ముడిపెట్టరాదని అమిత్ షా అన్నారు. స్థిరమైన ప్రభుత్వం మార్కెట్‌ను పెంచడంలో సహాయపడుతుందని హైలైట్ చేస్తూ, జూన్ 4 తర్వాత మార్కెట్లు మ‌రింత‌గా పెరుగుతాయ‌ని అన్నారు. అలాగే, బీజేపీ నేతృత్వంలోని కూటమి భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు. 
 

click me!