బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్.. అన్నపై రేప్ కేసు పెట్టి..!

By telugu news teamFirst Published Sep 2, 2021, 9:46 AM IST
Highlights

ఆ రోజు తాను బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లడంతో అన్నయ్య తనపై ఆగ్రహం వ్యక్తం చేశాడని, చేయి కూడా చేసుకున్నాడని పేర్కొంది. దీంతో..అతడిపై ఇలా ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చింది.


ఆమె బాయ్ ఫ్రెండ్ తో సరదాగా గడిపింది. కానీ.. ఆ విషయం ఆమె సోదరుడికి తెలియడంతో మందలించాడు. దీంతో.. కోపంతో.. తన అన్న తనపై అత్యాచారం చేశాడంటూ తప్పుడు కేసు పెట్టింది. ఫలితంగా ఆమె ఫిర్యాదుతో.. ఆమె సోదరుడు రెండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. రెండేళ్ల తర్వాత.. అసలు విషయం బయటపడటం గమనార్హం. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

2019లో యువతి ఫిర్యాదు చేయడంతో ఆమె అన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన సమయంలో ఆమె మైనర్ అన్న వాదన కూడా తెరపైకి రావడంతో యువకుడిపై పోక్సో చట్టం కింద కూడా కేసు దాఖలైంది. దీంతో అతడు రెండేళ్ల పాటు జైల్లోనే గడిపాడు. తాజాగా ఆమె అసలు నిజం చెప్పేందుకు ముందుకు వచ్చింది. 

ఆ రోజు తాను బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లడంతో అన్నయ్య తనపై ఆగ్రహం వ్యక్తం చేశాడని, చేయి కూడా చేసుకున్నాడని పేర్కొంది. దీంతో..అతడిపై ఇలా ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలో.. దర్యాప్తు అధికారి, యువతి చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం యువకుడు నిర్దోషి అంటూ తీర్పు వెలువరించింది. యువతి ఇచ్చిన స్టేట్‌మెంట్లో పరస్పర విరుద్ధమైన పలు వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అంతేకాకుండా.. ఘటన జరిగిన సమయంలో ఆమె మైనర్ అని చెప్పేందుకు కూడా ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. 

‘‘నిందితుడితో ఉన్న బాంధవ్యం కారణంగా యువతి ఈ కేసు మరింత ముందుకెళ్లేందుకు అంగీకరించి ఉండేది కాదు. ఆమె ఇలా నమ్మశక్యం కానీ పరస్పర విరుద్ధమైన స్టేట్‌మెంట్లు ఇవ్వడం, పూర్తి ఆధారాలు అందుబాటులో లేకపోవడం కారణంగా ముద్దాయిపై మోపిన నేరం రుజువు కాలేదు’’ అని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

click me!